నచ్చే ప్రేమ కథ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అశ్విని క్రియేషన్స్ బ్యానర్‌పై జి.లక్ష్మి నిర్మాతగా.. శివగంగాధర్ డైరెక్షన్‌లో మహిధర్, సోనాక్షిసింగ్ రావత్‌లను తెలుగుతెరకు పరిచయంచేస్తూ నిర్మించిన చిత్రం నా లవ్ స్టోరీ. లవ్‌స్టోరీలలో ఇది ఒక ప్రత్యేకతను చూపుతుందనేలా అంచనాలను పెంచిన ఈ సినిమా ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో మహీధర్ చెప్పిన విశేషాలు..మాది విజయవాడ, సివిల్ ఇంజనీరింగ్ చేసా. మోడలింగ్‌లో అనుభవం ఉంది. నేను యాక్టింగ్ బిక్షుగారి దగ్గర నేర్చుకున్నా. మా అమ్మగారు పబ్లిషర్ అవడంవల్ల రైటర్స్, డైరెక్టర్స్‌తో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అలా డైరెక్టర్ శివగారితో పరిచయంఅయ్యారు. ఆయన నాకు కథ చెప్పడం, నాకు చేయాలనిపించడం, నేను యాక్టింగ్ కోర్సుచేశానని ఆయన నన్ను నమ్మి కథను సెట్స్‌మీదకు తీసుకెళ్ళడం చాలా ఫాస్ట్‌గా అయిపోయిందంతా.. ప్రస్తుతం సమాజంలో ప్రతీ అబ్బారుూ ఎదుర్కొంటున్న సమస్యే. వయసు మీదపడుతున్నా పెళ్లికాకపోవడం, అక్కడినుంచి ఆ అబ్బాయికి ఒక అమ్మాయి పరిచయమవడం, ఆ తర్వాత ఒక క్యూట్ లవ్‌స్టోరీ. లవ్‌స్టోరీ ఎలా సక్సెస్ అయింది అన్న దానిమీద కథ నడుస్తూంటుంది. ఇందులో నా పాత్ర లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ తీరుగుతుంటాను. దర్శకుడు శివగారు చాలా హార్డ్‌వర్కింగ్ పర్సన్. ఆయన కూడా ఆర్టిస్ట్‌అవడంవల్ల ఎదుటివారి నుంచి ఎంతవరకు రాబట్టుకోవాలో బాగా తెలుసు. అందరం కొత్త వాళ్ళమైనా కానీ ఒకటికి రెండుసార్లు చెప్పి బాగా చేయించుకోగలిగారు. హీరోయిన్.. సోనాక్షిసింగ్ రావత్ మొదట్లో తెలుగులో కొంచెం ఇబ్బందిపడినా తర్వాత్తర్వాత అర్థంచేసుకుని చాలా బాగా చేసింది. వేద నివాస్‌గారు మా సినిమాకు మ్యూజిక్ ఇచ్చారు. నాలుగు పాటలున్నాయి. ఆల్రెడీ రిలీజ్ అయిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరో సినిమా చేశాను. షూటింగ్ దాదాపు చివరి దశలో ఉంది.