‘టిక్ టిక్ టిక్’ విజయోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలి స్పేస్ మూవీగా తెరకెక్కిన చిత్రం ‘టిక్ టిక్ టిక్’ గత శుక్రవారం విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. జయం రవి హీరోగా తెలుగులో తొలి సక్సెస్‌ను అందుకున్నారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకంపై లక్ష్మణ్ చదలవాడ, చదలవాడ పద్మావతి ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఈ చిత్ర సక్సెస్ మీట్‌ను ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటుచేశారు. దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ మాట్లాడుతూ.. ప్రేక్షకుల మీద నమ్మకంతో ఇలాంటి ఓ స్పేస్ ఫిలింను తీశాం. వారు మా నమ్మకాన్ని వమ్ముచేయలేదు. లక్ష్మణ్‌గారు భారీగా విడుదలచేశారు. వారికి ధన్యవాదాలన్నారు. జయం రవి మాట్లాడుతూ.. ఇదొక కొత్త ప్రయత్నం. సక్సెస్ చేసి మాకు ప్రేక్షకులు, క్రిటిక్స్ ఎంకరేజ్ చేసారు. తెలుగు సినిమా పరిశ్రమలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇప్పుడు టిక్ టిక్ టిక్ సక్సెస్‌తో డబుల్ హ్యాపీగా ఉన్నాను. లక్ష్మణ్‌గారు ఈ చిత్రాన్ని భారీగా విడుదల చేశారు. మంచి పబ్లిసిటీ కూడా చేస్తున్నారన్నారు. త్వరలో తెలుగు సినిమా కూడా చేస్తానన్నారు. ఈసినిమా మేకింగ్‌కోసం ఎంతో కష్టపడ్డాం. చిత్ర విజయం అదంతా మర్చిపోయేలా చేసింది. సీజీవర్క్ ఈ సినిమాకు హైలెట్‌గా నిలిచింది. మా నిర్మాతలు గట్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇమాన్‌గారి సీజీ కూడా ఈ సక్సెస్‌లో ప్రధాన బలం. నా కొడుకు ఆరవ్ కూడా ఈ సినిమాతో పరిచయమవటం ఆనందంగా ఉందన్నారు. లక్ష్మణ్ చదలవాడ మాట్లాడుతూ.. టిక్ టిక్ టిక్ ప్రేక్షకుల విజయం. జెన్యూన్ వౌత్‌టాక్‌తో ఈ సినిమా ఆడుతోంది. సౌత్ ఇండియానుంచి ఈ తరహా సినిమా రావటం మనందరికీ గర్వకారణం. మా బ్యానర్‌లో వరుసగా మూడో చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. కామన్ ఆడియెన్స్ ఈ చిత్రాన్ని చాలాబాగా ఎంజాయ్ చేస్తున్నారన్నారు.