నితిన్ సరసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్ హీరోగా ఛలో’ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘్భష్మ’ అనే టైటిల్ పెట్టారు. ‘సింగిల్ ఫరెవర్’ అనేది ఉపశీర్షిక. ఛలో’ మాదిరిగానే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటర్‌టైనింగ్‌గా మలచనున్నాడని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో నితిన్ సరసన హన్సికను హీరోయిన్‌గా తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలోనే నితిన్ హన్సిక ‘సీతారాముల కళ్యాణం లంకలో’ అనే చిత్రంలో కలిసి నటించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోంది. దర్శకుడు వెంకీ కుడుముల చెప్పిన కథ హన్సికకు బాగా నచ్చి వెంటనే డేట్స్ అడ్జెస్ట్ చేశారట. ఈ చిత్రాన్ని ఆగస్టులో అధికారికంగా లాంఛ్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించనున్నారు. ప్రస్తుతం నితిన్ దిల్ రాజు నిర్మాణంలో జరుగుతున్న శ్రీనివాస కళ్యాణం చిత్రాన్ని పూర్తిచేసే పనిలో ఉన్నాడు.