ఇంద్రగంటి - దిల్‌రాజుల మల్టీస్టారర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాలు కనుమరుగైన సందర్భంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను వెంకటేశ్, మహేశ్ వంటి స్టార్ హీరోలతో తెరకెక్కించి మల్టీస్టారర్ చిత్రాలకు నాంది పలికిన నిర్మాత దిల్‌రాజు.. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. అక్కడినుండి మల్టీస్టారర్ చిత్రాల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది దిల్‌రాజు ఇప్పటికే వెంకటేశ్, వరుణ్‌తేజ్‌లతో ఎఫ్2 (్ఫన్ అండ్ ప్రస్టేషన్) అనే మల్టీస్టారర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది కాకుండా మరో మల్టీస్టారర్‌కు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శ్రీకారం చుడుతున్నారు స్టార్ నిర్మాత దిల్ రాజు. అష్టాచమ్మా, గోల్కొండ హైస్కూల్, అమీతుమీ, జెంటిల్‌మన్, సమ్మోహనం వంటి డిఫరెంట్, సెన్సిబుల్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ తెరకెక్కనుంది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ ప్రకటిస్తారు.