ఓషో జీవిత కథలో అమీర్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య సినిమాల్లో బయోపిక్ సినిమాల హవా ఎక్కువైంది. బయోపిక్ సినిమాలు తీయడంలో బాలీవుడ్ ముందుంది. ఇప్పుడు బయోపిక్ సినిమాలంటే ప్రేక్షకులు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అటు బాక్స్‌ఆఫీస్‌వద్ద కూడా మంచి విజయం అందుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో బయోపిక్ సినిమాలు వచ్చాయి. వస్తున్నాయి. తాజాగా మరో బయోపిక్‌కు రంగం సిద్ధంఅయింది. ఆధ్యాత్మిక గురువు ఓషో రజనీష్ జీవిత కథ ఆధారంగా రూపొందే బయోపిక్ సినిమాలో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్‌ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఈ సినిమాకోసం అమీర్‌ఖాన్ తన లుక్‌సెట్ అవుతుందా లేదా అన్న విషయంపై ఫోకస్ పెట్టాడు. దానికి సంబంధించిన మేకప్ ఆర్టిస్టులతో టెస్ట్‌ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన నాలుగు గెటప్స్‌లో కనిపిస్తారట. ఈ సినిమాలో అలియాభట్ కీలక పాత్రలో నటిస్తుంది.