మరోసారి లక్కీ ఛాన్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే స్టార్ హీరోలతో కూడా జత కట్టేసి క్రేజీ హీరోయిన్‌గా మారింది అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్. కేవలం నాలుగేళ్లలో ఈ అమ్మడు దాదాపు అందరి హీరోలతో సినిమాలు చేసింది. అయితే ఈమధ్య కాస్త వరుస పరాజయాలు టెన్షన్ పెట్టాయి. దాంతోపాటు అవకాశాలు తగ్గాయి. తమిళంలో కూడా పరిస్థితి అలాగే వుంది. తమిళంలో రెండు సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడికి మరో క్రేజీ ఛాన్స్ దక్కింది. అది కూడా సూపర్‌స్టార్ సరసన కావడం విశేషం. ఆ వివరాల్లోకి వెళితే ఇదివరకు మహేష్ సరసన స్పైడర్ సినిమాలో నటించిన ఈ అమ్మడికి ఆ సినిమా తీవ్ర నిరాశను మిగిల్చింది. అయినా సరే మహేష్ రకుల్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం తన 25వ సినిమాను వంశీ పైడిపల్లితో చేస్తున్న మహేష్ ఆ తరువాత చిత్రాన్ని సుకుమార్‌తో చేయడానికి కమిట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్‌గా రకుల్‌ని తీసుకోవాలని సుకుమార్ చెప్పడంతో మహేష్ కూడా ఓకె చెప్పాడట. అన్నట్టు రకుల్ సుకుమార్‌తో నాన్నకు ప్రేమతో సినిమా చేసింది. సో మొత్తానికి రకుల్ మరోసారి లక్కీ ఛాన్స్ కొట్టేసింది.