ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉదయ్ శంకర్, హైపర్ ఆది, దొడ్డన్న ముఖ్యపాత్రల్లో చంద్ర సిద్ధార్థ్ దర్శకత్వంలో రాక్‌లైన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రాక్‌లైన్ వెంకటేష్ నిర్మించిన చిత్రం ఆటగదరా శివ. ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ వేడుకలో నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ- నేను కమర్షియల్ సినిమాలు ఎన్నో తీశాను. కానీ ఇలాంటి కానె్సప్ట్ బేస్డ్ సినిమా చేయాలని ఎప్పటినుండో ఉంది. ఈ కథను దర్శకుడు చంద్ర సిద్ధార్థ్ అద్భుతంగా తెరకెక్కించారు. ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా. ఇలాంటి మంచి కానె్సప్టులను ప్రోత్సహిస్తే మరిన్ని మంచి సినిమాలు వస్తాయి. ఈ సినిమాలో ఉదయ్ శంకర్, హైపర్ ఆది, దొడ్డన్న చాలా అద్భుతంగా నటించారు అన్నారు. దర్శకుడు ఉదయ్‌శంకర్ మాట్లాడుతూ- ప్రస్తుతం సినిమాలు తీయాలంటే చాలా కష్టంగా మారింది. ఈ సమయంలో ఈ కథ విన్నాను. దానికి తనికెళ్ల భరణి రచించిన ఆటగదరా శివ టైటిల్ బాగుంటుందని నిర్మాతకు చెప్పడంతో ఆయన ఓకె చెప్పారు. మంచి ఎమోషన్‌తో కూడుకున్న సినిమా ఇది. తప్పకుండా అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది అన్నారు. దొడ్డన్న మాట్లాడుతూ- నాకు తెలుగులో సినిమాలు చేయాలని అవకాశాలు వచ్చాయి. కానీ ఇక్కడ సినిమాలు చేస్తే కన్నడంలో ఛాన్సులు ఇవ్వమని చెప్పడంతో ఏ తెలుగు సినిమా చేయలేదు. చాలాకాలానికి ఈ సినిమాలో నటించడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ సినిమాను చాలా నాచురల్‌గా తెరకెక్కించాడు దర్శకుడు. ఎన్నో కమర్షియల్ సినిమాలు తీసిన వెంకటేష్ ఈ సినిమాను నిర్మించారంటే ఆయన గట్స్ ఏమిటో అర్థమవుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో హైపర్ ఆది, ఉదయ్ శంకర్ తమ అనుభవాలు తెలిపారు.