బాలీవుడ్ ఎంట్రీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ ప్రాంతీయ భాషలో నైనా హీరో హీరోయిన్‌గా క్రేజ్ తెచ్చుకున్న తారలు కనీసం ఒక్క సినిమా అయినా బాలీవుడ్‌లో చేయాలని అనుకుంటారు. ఎందుకంటే బాలీవుడ్‌లో ఒక్క సినిమా చేస్తే చాలు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోవచ్చు. ఈవిషయంలో ఎక్కువగా హీరోయిన్స్ ఫోకస్ చేస్తుంటారు. ఇక బాలీవుడ్ నుండి కూడా సౌత్‌లో హీరోయిన్స్‌గా క్రేజ్ తెచ్చుకున్న భామలు ఉన్నారు. తాజాగా ఈ అందాల రాక్షసి ఫోకస్ బాలీవుడ్‌పై పడింది. ఇంతకీ ఆ అందాల రాక్షసి ఎవరో మీకు ఈపాటికే అర్థం అయి ఉంటుంది కదా.. అవును మీరు ఊహించిన హీరోయిన్.. లావణ్య త్రిపాఠి. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత పలు చిత్రాలతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. ఈమధ్యే లావణ్యకు ఆశించిన స్థాయి విజయాలు దక్కడంలేదు. అందుకే.. అవకాశాలు బాగా తగ్గాయి. దాంతో ఈ అమ్మడు ఫోకస్ బాలీవుడ్‌పై పడిందట. ఇప్పటికే అక్కడ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. పలువురు బాలీవుడ్ మేకర్స్‌తో టచ్‌లో వుంటుందట. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తోంది. మరి ఈ అమ్మడికి బాలీవుడ్‌లో అవకాశాలు వస్తాయో లేదో చూడాలి.