జిగేల్ జిగేల్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ నవ నారాయణ సినీ క్రియేషన్స్ పతాకంపై అభయ్, గీత్ షా హీరోహీరోయిన్లుగా నాగరాజు తలారి దర్శకత్వంలో అంజనప్ప, నాగరాజ నిర్మాతలుగా నిర్మిస్తున్న యాక్షన్ సెంటిమెంట్ కామెడీ చిత్రం ‘జిగేల్ జిగేల్’. ఈ చిత్రం ప్రారంభం అయింది. ముహూర్తపు సన్నివేశానికి హీరోహీరోయిన్లుపై ప్రముఖ పారిశ్రామికవేత్త పట్నం యాదగిరి క్లాప్ ఇచ్చారు. సింగర్ నేహా వౌష్మి కెమెరా స్విచ్ ఆన్‌చేశారు. ఫస్ట్ షాట్ డైరెక్షన్ ప్రముఖ దర్శకుడు టి.ఎన్.రాజు దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగరాజు తలారి మాట్లాడుతూ.. ఈ చిత్రం యాక్షన్ సెంటిమెంట్ కామెడీతో తెరకెక్కనుంది. హైదరాబాద్, గోవా, బెంగళూరు పరిసర ప్రాంతాలలో షూటింగ్ మూడు షెడ్యూల్డ్‌లో పూర్తి అవుతుంది. ఈ చిత్రంలో మూడు ఫైట్లు, ఐదు పాటలు ఉంటాయి. హీరో అభయ్ మాట్లాడుతూ.. ఇది నా రెండవ మూవీ, మొదటి చిత్రం ‘సుడిగాలి’ విడుదలకు సిద్ధంగా ఉంది. నన్ను నా యాక్టింగ్‌ను నమ్మి ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ నన్ను ఎంపిక చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని తప్పకుండా ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ చాలాబాగా నచ్చి, సంగీత దర్శకుడు ఇచ్చిన మంచి ట్యూన్స్ విని, ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించడానికి రెడీ అయ్యామన్నారు. హీరోయిన్ గీతాషా మాట్లాడుతూ.. తెలుగు ప్రేక్షకులకు ‘వైరస్’ మూవీ ద్వారా పరిచయం అయ్యాను. ఈ చిత్రం ద్వారా మంచి గుర్తింపు లభిస్తుందని అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ ర్యాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో ఐదు పాటలు బాగా వచ్చాయని, కథకు తగ్గట్టు రీ రికార్డింగ్‌కు స్కోప్ ఉన్న చిత్రం అన్నారు. షమ్ము, బిల్లాబ్రదర్స్, ప్రియాంక, చంద్రకాంత్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి బైపల్లి, మాటలు: కోదండరాం జ్వాలపురం, రాజు వైట్ల, పాటలు: శ్రీనుసాగర్, సంగీతం: ర్యాప్‌రాక్ షకీల్, నిర్మాతలు: అంజనప్ప, నాగరాజ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: నాగరాజు తలారి.