మై డియర్ మార్తాండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థర్టీ ఇయర్స్ ఇక్కడ.. అంటూ తనదైన కామెడీ మేనరిజమ్, టైమింగ్‌తో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న స్టార్ కమెడియన్ పృథ్వీ టైటిల్ పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘మై డియర్ మార్తాండం’. మేజిన్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సయ్యద్ నిజాముద్దీన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరీష్ కె.వి. దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం చిత్రీకరణను పూర్తిచేసుకుంది. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమా టీజర్‌ను విడుదలయంది. రాకేందు వౌళి, కళ్యాణ్ విఠపు, కల్పిక గణేశ్ కీలక పాత్రధారులు. కల్పిక మాట్లాడుతూ- ‘‘18 రోజుల్లో షూటింగ్ పూర్తయ్యింది. డైరెక్షన్ టీం వల్లనే అది సాధ్యమైంది. పృథ్వీగారు ఇందులో మా అంకుల్ పాత్రలో కనపడతారు. క్రైమ్ కామెడీ అయినా సినిమా చూసి వచ్చేటప్పుడు సంతోషంగా బయటకు వస్తారు. రాకేందు వౌళితో నటించడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. పృథ్వీ మాట్లాడుతూ.. ‘‘ఈ సంస్థలో పనిచేయడం ఆనందంగా ఉంది. దర్శకుడు హరీశ్ పక్కా స్క్రిప్ట్‌తో సినిమాను సెట్స్‌కి తీసుకెళ్లారు. ఒక్క డైలాగ్ కూడా చేంజ్ లేకుండా సినిమా చేశాం. మంచి పాత్ర చేయడమే కాదు.. మంచి పారితోషికం కూడా అందుకున్నాను. లాయర్ పాత్రలో నటించాను. అమాయకుడిగా ఉండే తెలివైన వాడి పాత్ర నాది. జయప్రకాశ్‌రెడ్డి, తాగుబోతు రమేష్, కృష్ణ్ భగవాన్ తదితరులతో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు హరీశ్ కె.వి. మాట్లాడుతూ.. ‘‘మాది కోర్టురూం క్రైమ్ కామెడీ. అనుకున్న సమయంలో పూర్తి చేశామంటే అందరి సహకారమే కారణం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో రాకేందు వౌళి, కళ్యాణ్ విఠపు తదితరులు పాల్గొన్నారు.