ఖాకీ దర్శకుడితో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం ‘విశ్వాసం’ చిత్రంలో నటిస్తున్నాడు. యాక్షన్ చిత్రాల దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ చిత్రానికి సంబంధించి సగభాగాన్ని హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలోనే తెరకెక్కించారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ చిత్రం తరువాత అజిత్ యువ దర్శకుడు వినోద్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవల ఈ దర్శకుడు కార్తి, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా ‘తీరం అడిగారా ఒండ్రు’ అనే చిత్రాన్ని తెరకెక్కించి మంచి విజయాన్ని సాధించారు. నిజాయితీగల పోలీస్ ఆఫీసర్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులో ఖాకి పేరుతో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఇక వినోద్ చెప్పిన కథ అజిత్‌కు బాగా నచ్చడంతో వెంటనే ఆయనతో సినిమా పూర్తిచేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం విశ్వాసం చిత్రం షూటింగ్ చివరి దశకు చేరింది. ఈ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత అజిత్ ఈ కొత్త చిత్రాన్ని మొదలుపెట్టనున్నారు.