27న ‘మిషన్ ఇంపాజిబుల్- ఫాలౌట్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచీస్‌కున్న ప్రత్యేకత ఏంటంటే ప్రతి సినిమాకూ దర్శకుడు మారుతూ ఉండటమే. ఈ వరుసలో ఒక్కో సినిమాకు, ఒక్కో దర్శకుడు పని చేయడాన్ని గమనించవచ్చు. ఈసారి హీరో టామ్‌క్రూయిజ్ ‘మిషన్ ఇంపాజిబుల్- ఫాలౌట్’ కోసం తనకిష్టమైన దర్శకుడు మెక్ క్వారీని ఎంపిక చేసుకున్నారు. వీరిద్దరి కలయికలతో రూపొందిన రెండో సినిమా ఇది. ఈనెల 27న విడుదల కానున్న ‘మిషన్ ఇంపాజిబుల్-్ఫలౌట్’ గురించి మెక్ క్వారీ మాట్లాడుతూ- ‘‘నన్ను టామ్ కలిసి మిషన్ ఇంపాజిబుల్-్ఫలౌట్‌ను దర్శకత్వం చేయమని అడిగినప్పుడు నేను ఆయనతో ఒకటే చెప్పా. ఇంతకు మునుపు సినిమాలకన్నా ఈ సినిమాలో దృశ్యపరంగా పెద్ద మార్పు తీసుకుని వస్తాను అని. గత చిత్రాలను చూసిన ప్రేక్షకులకు ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మరొకరు అని ఇట్టే తెలియాలన్నది నా ఫీలింగ్’’ అని చెప్పారు. టామ్‌క్రూయిస్ మాట్లాడుతూ.. ‘‘నేను 2012లో మెక్‌క్వారీతో యాక్షన్ థ్రిల్లర్ ‘జాక్ రీచర్’ చేశాను. ఆయనతో పనిచేయడం నాకు చాలా ఇష్టం. అత్యద్భుతమైన ప్రతిభావంతుడు. మా ‘మిషన్ ఇంపాజిబుల్-్ఫలౌట్’లో విజువల్ స్టయల్‌లో మార్పులు చేయాలనుకున్నారు. అంతకుమునుపు ఇంకెవరో చేసినదే అయినా, ఆయన తన మార్కు ఉండాలనుకున్నారు. అనుకున్న ప్రకారమే విజయాన్ని సాధించారు. ఇందులో ఆయన బోల్డ్ స్టోరీ టెల్లింగ్ విధానాన్ని గమనించవచ్చు. ఈ సినిమాలో కథలోని క్లిష్టత, పాత్రల తీరుతెన్నులు నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. విడుదలకు సిద్ధమయ్యాం. ప్రేక్షకులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తారా అనే ఆకాంక్షతో ఉన్నాను’ అని అన్నారు. పారావౌంట్ పిక్చర్స్ తెరకెక్కించిన ‘మిషన్ ఇంపాజిబుల్-్ఫలౌట్’ ఈనెల 27న విడుదల కానుంది. ఇండియాలో వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంస్థ ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగులో విడుదల చేయనుంది.