శరవేగంగా ‘సైరా’ షూటింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి సంబంధించిన 35 రోజుల తాజా షెడ్యూల్ నిన్నటితో ముగిసింది. ఈ షెడ్యూల్‌లో బ్రిటీష్ సైనికులకు వ్యతిరేకంగా పోరాడిన సన్నివేశాలను చిత్రీకరించారు. అతి తక్కువ కాంతిలో వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారట. బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజర్‌ను చిరు పుట్టినోజు సందర్భంగా ఆగస్టు 22న విడుదల చేసే అవకాశాలున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, రవికిషన్, సుధీప్, తమన్నా వంటి భారీ ప్రముఖ తారాగణం నటిస్తున్నారు. సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.

.