కాస్టింగ్ కౌచ్‌పై పూజ కామెంట్స్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్యకాలంలో సినిమా రంగంలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. ఇది ఒక్క టాలీవుడ్‌లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్- ఇలా అన్నిచోట్లా వుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ ఈ వ్యవహారంలో ధైర్యంగా ముందుకు వచ్చి ఈ విషయంపై బాహాటంగానే స్పందించారు. తాజాగా టాలీవుడ్‌లో కూడా కొందరు హీరోయిన్స్ స్పందించిన విషయం తెలిసిందే. ఇప్పటికే శ్రీరెడ్డి వ్యవహారం పెద్ద దుమారమే రేపుతోంది. ఈ విషయం పక్కనపెడితే తాజాగా కమల్‌హాసన్ సరసన విశ్వరూపం సినిమాలో నటించిన పూజా కుమార్, ఈమధ్యే రాజశేఖర్ సరసన గరుడవేగ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ హాట్ భామ తాజాగా కాస్టింగ్ కౌచ్‌గురించి స్పందించింది. ప్రస్తుతం పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం వున్న విషయం తెలిసిందే. దీని ద్వారా చాలామంది హీరోయిన్స్.. ముఖ్యంగా కొత్తగా వచ్చేవాళ్లు సఫర్ అవుతున్నారని తెలిపింది. అయితే ఈ కాస్టింగ్ కౌచ్ విషయంలో తనకు ఎలాంటి చేదు అనుభవాలు లేవని చెప్పింది ఈ ఇండో అమెరికన్ గ్లామర్ భామ పూజ!