త్వరలో దృశ్యకావ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా పుష్యమి ఫిలిం మేకింగ్ పతాకంపై బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, లవ్ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, నేపథ్య సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని తెలిపారు. ప్రతి సీన్ అందరికీ నచ్చేలా రూపొందిన ఇది ఎమోషనల్ లవ్ స్టోరీగా సరికొత్త కథాంశంతో ఉత్కంఠభరితంగా సాగే చిత్రమని, తప్పక విజయవంతం అవుతుందని అన్నారు. ఓ అందమైన హారర్ చిత్రానికి లవ్ ఫ్లేవర్ చేర్చి రూపొందిన ఈ సినిమాను అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, కామెడీ సస్పెన్స్ జోనర్‌లో ఓ హిట్ సినిమా నిలబడుతుందని వారు తెలిపారు. మధునందన్, అలీ, పృధ్వీ, సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర, రచ్చరవి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్:వి.నాగిరెడ్డి, సంగీతం:కమలాకర్, దర్శకత్వం: బెల్లం రామకృష్ణారెడ్డి.