సువర్ణసుందరి వస్తోంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లో కంటెంట్ బేస్డ్ సినిమాలు విశేషమైన ఆదరణ చూరగొంటున్నాయ. ఆ నేపథ్యంలో అద్భుతమైన కంటెంట్, అమేజింగ్ గ్రాఫిక్స్‌తో ఎపిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘సువర్ణసుందరి’. పునర్జన్మ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో ప్రఖ్యాత నటీమణి జయప్రద కీలక పాత్ర పోషిస్తోండగా.. ఆమెకు తల్లిగా పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఇటీవల విడుదలైన టీజర్‌కి విశేషమైన స్పందన లభించగా.. ఆగస్టులో ఆడియోను విడుదల చేసి సెప్టెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బాహుబలి, భజరంగీ భారుూజాన్ చిత్రాలకి వర్క్ చేసిన విఎఫ్‌ఎక్స్ టీం సువర్ణసుందరి చిత్రానికి కూడా వర్క్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశకు చేరుకుంది. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేందుకు మా టీం అందరం కృషి చేస్తున్నారన్నారు దర్శక నిర్మాతలు. సూర్య ఎంఎస్‌ఎన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శ్రీకృష్ణదేవరాయల స్టోరీ ఆధారంగా తెరకెక్కనున్నట్టు సమాచారం. చరిత్ర భవిష్యత్‌ని వెంటాడుతోంది అనే ట్యాగ్‌లైన్‌తో విజువల్ ఫీస్ట్‌గా చిత్రం రూపొందుతోంది. సాయికార్తీక్ ఈ చిత్రానికి సంగీత బాణీలు సమకూర్చుతున్నారు. నాగినీడు, కోట శ్రీనివాసరావు, ముక్తార్‌ఖాన్, అవినాష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి దర్శకత్వం:ఎం.ఎస్.ఎన్.సూర్య.