వెంకటలక్ష్మిగా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రత్తాలు.. రత్తాలు.. అంటూ మెగాస్టార్‌తో చిందులేసిన రత్తాలు.. అదేనండి హాట్ భామ లక్ష్మిరాయ్ ఐటెం గర్ల్‌గా టర్న్ అయింది. ఇక సినిమాలు చేస్తుందా.. అసలు హీరోయిన్‌గా అవకాశాలు వస్తాయా అనుకున్నారు జనాలు.. కానీ ఈ అమ్మడు తాజాగా ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాలోనే ఛాన్స్ కొట్టేసింది. పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ సినిమా కథ మొత్తం లక్ష్మిరాయ్ పాత్ర చుట్టే తిరుగుతుందట.. అందుకోసం తాజాగా ఓ టైటిల్‌ని ప్రకటించారు. వేర్ ఈజ్ వెంకటలక్ష్మి అనే టైటిల్ ఖరారు చేశారు. గత సోమవారం నుండి ఈ సినిమా షూటింగ్‌లో లక్ష్మీరాయ్ కూడా పాల్గొంటుంది. తాజాగా ఈ టైటిల్‌తో పాటు ఓ ఫొటోను ఈ అమ్మడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసింది. ఇప్పటికే హాట్ ఫొటోలటో, బికినీలతో షాకిచ్చిన రత్తాలు ఈ సినిమాతో ప్రూవ్ చేసుకుంటే తప్ప మళ్లీ అవకాశాలు వచ్చే ఛాన్స్ లేదు. అందుకే ఈ సినిమాపై ఈ అమ్మడు చాలా నమ్మకంతో ఉంది.