భారతీయుడు-2లో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో క్రేజీ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న అజయ్ దేవగన్ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇప్పటికే బాలీవుడ్ హీరో అక్షయ్‌కుమార్ కూడా కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన రజనీకాంత్‌తో కలిసి రోబో 2.0లో నటించాడు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా కోలీవుడ్‌లోకి వెళ్లడం ఆసక్తి రేకెత్తిస్తోంది. తాజాగా అజయ్ దేవగన్ తమిళంలో నటించేందుకు రంగం సిద్ధం అవుతోంది. అయితే ఈసారి ఆయన నటించేది ఎవరితో తెలుసా... జాతీయ నటుడు కమల్‌హాసన్‌తో! అవును.. ప్రస్తుతం విశ్వరూపం -2 చిత్రాన్ని తెరకెక్కించిన కమల్, తన తదుపరి చిత్రంగా భారతీయుడు సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు అప్పుడే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇటీవలే ఈ సినిమా విషయంలో అజయ్‌తో శంకర్ మంతనాలు జరిపాడని.. అజయ్ కూడా ఈ సినిమాలో నటించేందుకు ఓకె చెప్పాడని తెలిసింది. సో.. అజయ్ దేవగన్ భారతీయుడు-2 సినిమాలో ఏ తరహా పాత్రలో నటిస్తాడా అన్న ఆసక్తి ఎక్కువైంది.