వామ్మో.. బామ్మ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనిరుధ్ ప్రొడక్షన్స్ సమర్పణలో విజయ్ ఆనంద్ దర్శకత్వంలో సిహెచ్.వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి జి.సంధ్యరెడ్డి నిర్మాతలుగా శ్రీ వెంకటలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రం ‘వామ్మో బామ్మ’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ మరియు పాటలు ఈరోజు హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ప్రముఖుల సమక్షంలో విడుదలచేసారు. ప్రముఖ నిర్మాతలు సాయివెంకట్ మరియు తుమ్మలపల్లి రామసత్యనారాయణగారు ఈ ఆడియో వేడుకకు ముఖ్యఅతిథులుగా విచ్చేసి ఈ సినిమాలోని పాటలు మరియు ట్రైలర్‌ను విడుదలచేశారు. ఈ చిత్రంయొక్క ఆడియో కీ మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నారు. ‘వామ్మో బామ్మ’ ఒక కామెడీ హారర్ ఎంటర్‌టైనర్. సీనియర్ నటీమణి శ్రీలక్ష్మిగారు ఈ చిత్రంలో టైటిల్ రోల్ పోషించారు. ఈ సందర్భంగా.. దర్శకుడు విజయ్‌ఆనంద్ మాట్లాడుతూ.. ‘సీనియర్ నటులు శ్రీలక్ష్మిగారు ఈ సినిమాలో నటించటం మాకు ఒక్క గొప్ప వరం. సినిమాలో తానే హీరో. ఫస్ట్ కాపీ రెడీగా ఉంది. అనుకున్న దానికంటే సినిమా చాలాబాగా వచ్చింది. మా నిర్మాతలు సిహెచ్.వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి జి.సంధ్యరెడ్డిగారికి నా కృతజ్ఞతలు. త్వరలోనే సినిమా విడుదల చేస్తాము’ అని అన్నారు. సాయివెంకట్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమాకి శ్రీలక్ష్మీగారే హీరో. బామ్మగా అద్భుతంగా నటించారు. సినిమా నేను చూసాను. చాలాబాగుంది సినిమా. సంగీత దర్శకుడు ఆదిత్య అందించిన పాటలు చాలా బాగున్నాయి. దర్శకుడు విజయ్ ఆనంద్ చాలా బాగా తీశారు. చిన్న సినిమాలు విడుదల చేయటం చాలా కష్టం కానీ ఈ సినిమాకి డిస్ట్రిబ్యూటర్ దగ్గరనుంచి మంచి ఆఫర్ వస్తుంది. ఈ సినిమా మంచి విజయం కావాలి’’అని కోరుకున్నారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు విజయ్ ఆనంద్ నా సినిమాలకి రైటర్‌గా పనిచేసాడు. ఈ సినిమా ఆడియో కీ మ్యూజిక్ ద్వారా విడుదలవుతుంది. నా సినిమా ఐస్‌క్రీం కూడా ఆ మ్యూజిక్ కంపెనీ ద్వారా విడుదలైంది. హీరో కిరణ్ మంచి మిత్రుడు. డిఫరెంట్ కానె్సప్ట్‌తో ఈ సినిమా తీశారు. శ్రీలక్ష్మిగారు ఈ చిత్రానికి ఒక్క హైలైట్‌గా నిలుస్తారు. గతంలో ‘బామ్మమాట బంగారు బాట’ మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ‘వామ్మో బామ్మ’ అంతటి విజయం సాధించాలి అని కోరుకున్నారు. సీనియర్ నటులు శ్రీలక్ష్మిగారు మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. డైరెక్టర్ చాలా కష్టపడి చేసారు. వన్‌మాన్ ఆర్మీగా తానే అంతా చూసుకున్నాడు. మంచి చిత్రం, కుటుంబ సభ్యులు అందరు కలిసి చూడదగ్గ చిత్రం. ఈ సినిమా విజయవంతం కావాలి’’ అని కోరుకున్నారు. హీరో కిరణ్ మాట్లాడుతూ ‘‘ఈరోజుల్లో చిన్న సినిమా కష్టాలు అందరికీ తెలుసు. అవకాశం దొరకటమే చాలా కష్టం. ఇప్పుడు మా సినిమా ‘వామ్మోబామ్మ’ త్వరలో విడుదలౌతుంది. చాలా సంతోషంగా ఉంది. శ్రీలక్ష్మిగారితో నటించటం నా అదృష్టం. సినిమా మంచి విజయం సాధించాలి’’ అని తెలిపారు. హీరోయిన్ ఆశే్లష మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా సంతోషంగా ఉంది సినిమా రిలీజ్ అవుతుంది అని. నేను చాలా ఎక్సైట్‌గా ఉన్నాను. సినిమా చాలా కష్టపడి చేసాం. మీ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను’’ అని తెలిపారు. కిరణ్, ఆశే్లష, హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీలక్ష్మి, మంజీరా, కిట్టు, వెంకట్, నరసింహారావు, గబ్బర్‌సింగ్ గ్యాంగ్. సంగీతం: ఆదిత్య, సాహిత్యం: శ్రీసాధనల వెంకటస్వామినాయుడు, కెమెరా: కర్ణ ప్యారసాని, ఎడిటింగ్: నెల్వకుమార్, డాన్స్: కపిల్ మాస్టర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.రాజశేఖర్, దర్శకుడు: విజయ్ ఆనంద్, నిర్మాతలు: సిహెచ్.వెంకటేశ్వరరావు మరియు శ్రీమతి జి.సంధ్యరెడ్డి, బ్యానర్: శ్రీ వెంకటలక్ష్మి ప్రొడక్షన్స్.