రోబో కథ నాదే?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా క్రేజీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో అప్పట్లో వచ్చిన రోబో (యందిరన్- తమిళం) ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ కూడా తెరకెక్కించారు. త్వరలోనే ఈ రోబో 2.0 విడుదల కావాల్సి వుంది. అయితే రోబో సినిమా కథ విషయంలో పెద్ద దుమారం రేగింది. ఈ కథ నాది అంటూ ఆరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి మద్రాసు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనికి నష్టపరిహారంగా కోటి రూపాయలు ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. తానూ రచించిన జాగిబా అనే నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారని ఆరోపించాడు. ఈ నేపథ్యంలో కోర్టులో కేసు ఫైల్ అయింది.. ఈ విషయంపై దర్శకుడు, రచయితా శంకర్ క్లారిటీ ఇవ్వాలని కోర్టు కోరడంతో.. తాజాగా శంకర్ స్పందించాడు. ఈ సినిమా కథ నాదే అని, ఎక్కడా కాపీ చేయలేదని అన్నారు. తమిళనాథన్ చెబుతున్న కథకు ఈ సినిమా కథకు చాలా వ్యత్యాసం ఉందని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఈ కేసు కోర్టులో నానుతూ ఉంది. తాజాగా ఈ కేసు హియరింగ్‌కు రావడంతో శంకర్ క్లారిటీ ఇచ్చి కౌంటర్ ఫైల్ దాఖలు చేశారు.