మెగాస్టార్ సరసన..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుష్క.. టాలీవుడ్‌లో ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్. ఓ వైపు గ్లామర్ హీరోయిన్‌గా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ మరోవైపు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో అదే స్టార్ హీరోలకు బాక్సాపీస్ వద్ద పోటీనిచ్చింది. తాజాగా ఈమె మెగాస్టార్ సరసన ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్దిమంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కాగా ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం వెతికే పనిలో ఉన్నాడట కొరటాల. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం, కొరటాల శివ తన తొలి చిత్రం ‘మిర్చి’లో హీరోయిన్‌గా నటించిన అనుష్కను మెగాస్టార్‌తో చేయబోయే సినిమా కోసం హీరోయిన్‌గా తీసుకోనున్నారు. ఇప్పటికే అనుష్క కూడా నటించడానికి అంగీకరించిందని తెలుస్తోంది. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి వుంది. ఇక ఈ చిత్రం ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభం కాబోతోందని టాక్.