శ్రీదేవిలా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోయింది రకుల్‌ప్రీత్‌సింగ్. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ సినిమా సక్సెస్‌తో మంచి విజయాన్ని అందుకున్న ఈమె, యువ హీరోలతోపాటు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తాజాగా రెండు, మూడు వరుస పరాజయాలు పలకరించడంతో ఈమెకు కొత్త అవకాశాలు కరువయ్యాయి. అటు కోలీవుడ్‌లో కూడా రకుల్ మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా మళ్లీ తెలుగులో బిజీ అవుతున్న ఈమెకు ఓ లక్కీ ఛాన్స్ దక్కింది. మహానటుడు ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న సినిమాలో ఇప్పటికే పలువురు క్రేజీ నటీనటులను ఎంపిక చేశారు. ముఖ్యంగా ఎన్టీఆర్ సతీమణి బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా, చంద్రబాబుగా రాణా, అక్కినేనిగా సుమంత్, కృష్ణగా సుధీర్‌బాబు నటిస్తున్నారు. ఇందులో మరో కీలక పాత్ర అయిన శ్రీదేవి పాత్రలో రకుల్‌ప్రీత్‌ను ఎంపిక చేశారట. ఎన్టీఆర్ కెరీర్‌లో శ్రీదేవిది ముఖ్యపాత్రే. ఎందుకంటే, మాస్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ నటించిన సూపర్‌హిట్ సినిమాల్లో శ్రీదేవే హీరోయిన్. తాజాగా శ్రీదేవి పాత్రను రకుల్ దక్కించుకుంది. త్వరలోనే ఆమె ఎపిసోడ్స్‌కు సంబంధించిన సన్నివేశాల్ని చిత్రీకరిస్తారట. ప్రస్తుతం ఫిలింసిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అవకాశం రావడంతో రకుల్ ఖుషీమీద ఉంది.