7న పేపర్‌బాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతోష్ శోభన్ హీరోగా జయశంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా పేపర్‌బాయ్. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కానుంది. రియాసుమన్, తాన్యా హోప్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించడం విశేషం. అలాగే ఆయనే నిర్మిస్తున్నాడు కూడా. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు.. టీజర్‌కు ప్రేక్షకులనుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. టీజర్‌కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ప్రేమలోపడిన తర్వాత ఏం జరిగింది అనేది ఈ చిత్ర కథ. భీమ్స్ సంగీతం, సౌందర్‌రాజన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సంతోష్ శోభన్, రియాసుమన్, తాన్యాహోప్, పోసాని కృష్ణమురళి, అభిషేక్ మహర్షి, విద్యుల్లేక రామన్, జయప్రకాశ్‌రెడ్డి, బిత్తిరి సత్తి, సన్నీ, మహేశ్ విట్టా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్, ఎడిటర్: తమ్మిరాజు, నిర్మాతలు: సంపత్ నంది, రాములు, వెంకట్ మరియు నరసింహా, దర్శకత్వం: జయశంకర్,