మన్యంలో విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభాకర్, వర్షా బోల్‌మా ముఖ్యపాత్రల్లో ఎస్.వి.రమణ స్వీయ దర్శకత్వంలో సాయి సంహిత్ బ్యానర్‌పై తెరకెక్కిన మన్యం చిత్రం ఇటీవలే విడుదలై మంచి హిట్ టాక్‌తో రన్ అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత రమణ మాట్లాడుతూ- గత పదేళ్లుగా పరిశ్రమలో ఉన్నాను. నాలుగైదు సంవత్సరాలుగా నా చిత్రాన్ని ప్రేక్షకులతో కూర్చుని చూడాలన్న కల ఇన్నాళ్లకు నెరవేరింది. ఈ సినిమా మొదలుపెట్టి రెండు సంవత్సరాలకుపైగా అయ్యింది. చాలా కష్టపడ్డాను. చిన్న సినిమా బడ్జెట్ గురించి అందరికీ తెలిసిందే. చిన్న సినిమాలో కథే హీరో. మంచి కానె్సప్టుతో తెరకెక్కించిన ఈ సినిమా 34 సెంటర్లలో విడుదల చేశాను. ఈ సినిమా విషయంలో ప్రతిఒక్కరూ సపోర్టు అందించారు. ఈ వేడుకకు నిర్మాత రాజ్‌కందుకూరి రావడం ఆనందంగా ఉంది అన్నారు. రాజ్ కందుకూరి మాట్లాడుతూ- నేనిక్కడికి రావడానికి కారణం చిన్న సినిమాల్ని గౌరవించాలనే అభిప్రాయంతోనే. సినిమా అనేది ఒక్కటే. బాహుబలికైనా, చిన్న సినిమాకైనా ఒకేలా కష్టపడతారు. దర్శకుడు రమణ ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఈ సినిమా మంచి విజయం సాధించినందుకు టీమ్‌ను అభినందిస్తున్నాను అన్నారు. హీరోయిన్ వర్ష మాట్లాడుతూ- దర్శకుడి తపనతోనే ఈ విజయం సాధ్యమైంది. ఇందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు. సినిమా సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు అన్నారు. హీరో రఘువీర్ మాట్లాడుతూ- నన్ను హీరోగా నిలబెట్టిన దర్శకుడికి, ప్రేక్షకులకు ధన్యవాదాలు అన్నారు.