ఆమె విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూ ట్యూబ్ సంచలన తార స్వాతి నాయుడు టైటిల్ రోల్ పోషించిన చిత్రం ఆమె కోరిక. సురేష్ చౌదరి దర్శకత్వంలో ఎస్.ఆర్.మీడియా సమర్పణలో చిక్కల సత్యనారాయణ, ఎం.రత్నాకర్ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 10న విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు సురేష్ చౌదరి మాట్లాడుతూ- ఆలుమగల అనుబంధంలోకి అనుకోని వ్యక్తి రావడంతో ఆ సంసారం ఎలా ఛిన్నాభిన్నం అయిందనే కానె్సప్టుతో తెరకెక్కిన ఈ చిత్రం విడుదలైన అన్ని కేంద్రాల్లో మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా ఉంది. స్వాతి నాయుడు నటన, మ్యూజిక్, కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలిచాయి అన్నారు. నివాస్ గోగుల మాట్లాడుతూ- ఆంధ్రప్రదేశ్‌లో 40 థియేటర్‌లలో విడుదల చేశాం. రెస్పాన్స్ బాగుంది. లవ్, రొమాన్స్, ఫ్యామిలీ సెంటిమెంట్- ఇలా అన్ని రకాల అంశాలతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఈనెల 18న తెలంగాణలో విడుదల చేస్తున్నాం అన్నారు. స్వాతి నాయుడు మాట్లాడుతూ- నటనకు మంచి స్కోప్ వున్న పాత్ర ఇది. టైటిల్ చూసి వేరేలా అనుకోవద్దు. ఫ్యామిలీతో కలిసి చూసే చిత్రమిది అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించడం ఆనందంగా ఉంది అన్నారు.