చైతన్య, సమంతల ‘మజిలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిన్నుకోరి చిత్రంతో హిట్ కొట్టిన యువ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సమంత, నాగచైతన్య హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో ఏ మాయ చేసావె, ఆటోనగర్ సూర్య, మనం చిత్రాలు కలిసి చేసిన చైతు, సమంత పెళ్లి తర్వాత కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే కావడం విశేషం. తాజాగా ఈ చిత్రం టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో ‘మజిలి’ అనే టైటిల్ హల్‌చల్ చేస్తోంది. త్వరలో షూటింగ్ మొధలు కానున్న ఈ చిత్రం భార్యాభర్తలమధ్య అనుబంధాన్ని తెలిపేలా తెరకెక్కబోతోందట. హిందీ నటి దివ్యాంశ కౌశిక్ కీలక పాత్రలో నటించనున్న ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు. సాహు గారపటి, హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.