లాట్రోబ్ యూనివర్సిటీలో ‘సంజూ’ ప్రదర్శన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సినీ రంగంలో పేరొందిన ఇద్దరు ప్రముఖులు ఆస్ట్రేలియాలోని లాట్రోబ్ యూనివర్సిటీలో తమ బ్లాక్‌బస్టర్ సినిమా ‘సంజూ’ ప్రత్యేక ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ రాష్ట్రం లాట్రోబ్ యూనివర్సిటీ క్యాంపస్ బందూరాలో ఈ సినీ ప్రదర్శన జరిగింది. హిందీలో చిత్రీకరించిన సినిమా ‘సంజూ’పై 400 మందికి పైగా అతిథుల మధ్య ఇష్టాగోష్టి చర్చాగోష్టిలో బాలీవుడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణీ, రచయిత అభిషేక్ జోషి పాల్గొన్నారు. సినీ సాహిత్య అధ్యాపకుడు డాక్టర్ ఇయాన్ వుల్‌ఫోర్డ్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్ రచయిత హిరాణీ మాట్లాడుతూ.. లాట్రోబ్ యూనివర్సిటీలో చిత్రం ప్రదర్శించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అద్భుతమైన, సమగ్రమైన అనుభవమని వ్యాఖ్యానించారు. వివిధ దేశాల పౌరుల సమక్షంలో మా చిత్రాల ప్రదర్శన జరగడం సుసంపన్నమైన అనుభవం అని పేర్కొన్నారు. లాట్రోబ్ విశ్వవిద్యాలయ విద్యార్థులకోసం ప్రత్యేకంగా సినీ ప్రదర్శన ఏర్పాటుచేయడం నాకు ఆనందదాయకం. సంజయ్‌దత్ జీవిత కథ, ఆయన నటించిన సినిమాల ఆధారంగా నిర్మించిన బయోపిక్ ‘సంజూ’పై విద్యార్థులు, వివిధ సామాజికవర్గాల అభిప్రాయాలను తెలుసుకోవడం సంతోషదాయకం అని అభిప్రాయపడ్డారు. లాట్రోబ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జాన్‌దేవార్ మాట్లాడుతూ.. 1960నుంచి భారత సామాజిక వర్గ, భారతీయులతో సమర్ధవంతమైన అనుబంధ చరిత్ర తమ యూనివర్సిటీకి ఉందన్నారు. భారతదేశంతో సుదీర్ఘకాలంగా ఉన్న భాగస్వామ్యంతో తాను చాలా గర్వపడుతున్నానన్నారు. గతేడాది అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)తోపాటు ఎమిటీ యూనివర్సిటీ, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, లలీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, చండీగఢ్ యూనివర్సిటీ తదితర భారతదేశంలోని ప్రసిద్ధ విద్యాసంస్థలతో అనుబంధాన్ని పెనవేసుకున్నదని లాట్రోబ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జాన్‌దేవార్ చెప్పారు. జేఎన్‌ఎస్ యూనివర్సిటీతో కలిసి కొలాబరేటివ్ రీసెర్చ్, పీహెచ్‌డి స్కాలర్‌షిప్‌లతో కలిపి నూతన స్కాలర్‌షిప్ అవకాశాలను తాము ప్రకటించామని లాట్రోబ్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ జాన్‌దేవార్ చెప్పారు. తమ యూనివర్సిటీని హిరాణి, జోషి సందర్శించడం తమకు గౌరవమని పేర్కొన్నారు. లాట్రోబ్ యూనివర్సిటీని సందర్శించిన భారత ప్రముఖుల జాబితా క్రమక్రమంగా పెరుగుతోందని జాన్‌దేవార్ తెలిపారు. ఇంతకుముందు ఒకనాటి ప్రధాని ఇందిరాగాంధీ, క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్, మలైకా అరోరా ఖాన్, విద్యాబాలన్, అమితాబ్‌బచ్చన్ తదితరులు సందర్శించారని దేవార్ తెలిపారు. హిరాణీ, జోషి తమ రంగాల్లో లబ్ధప్రతిష్టులని చెప్పారు. లాట్రోబ్ యూనివర్సిటీ ఇప్పటికే బాలీవుడ్‌తో అనుబంధాన్ని పెనవేసుకున్నది అని పేర్కొన్నారు.