లీకేజీలతో నష్టం ఎక్కువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బన్నీవాసు నిర్మించిన గీతగోవిందం సూపర్‌హిట్ సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర నిర్మాత బన్నీవాసు చెప్పిన విశేషాలు..

ఈ స్థాయి విజయం..
సినిమా తీసేటప్పుడు కామెడీ ఎంటర్‌టైనర్‌గా బాగా తీస్తున్నాం. హీరో కూడా రైజింగ్‌లో ఉండడంతో మంచి కలెక్షన్స్ వస్తాయని అనుకున్నాం. కానీ ఈ రేంజ్‌లో ఓపెనింగ్స్‌ను ఊహంచలేదు. పరశురామ్ విజయ్‌కు కథ చెప్పినప్పుడు అతడికి నచ్చింది. కానీ విజయ్ డిఫరెంట్‌గా చేద్దాం అనుకుంటున్నాను. ఇలా ఎంటర్‌టైనర్‌గా ఒకే అవుతుందా? అని అడిగినప్పుడు ఈ సినిమా బి సెంటర్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుంది. నీ కెరీర్‌కు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఈసారి మమ్మల్ని నమ్మి చేయి అని సలహాఇచ్చాను. ఆయన దాన్ని నమ్మి ఈ సినిమా చేశాడు. ఆయన జెన్యూనిటీ. అనవసరమైన విషయాల్లో అస్సలు తల దూర్చడు. ఆయనకు నాకు మధ్య అన్నదమ్ముల రిలేషన్ ఉంటుంది.
గొప్ప ప్రశంస..
నా సినిమాలు చూసి స్టార్ హీరోలు ట్వీట్ చేస్తే బాగుండు అని అనుకుంటాను. ముందు అల్లుఅర్జున్ ఎడిటింగ్ రూమ్‌లో ఈ సినిమా చూసి కౌగలించుకున్నాడు. ఆ తరువాత నిన్న మహష్, రామ్‌చరణ్ సినిమా గురించి ట్వీట్ చేయడం ఎప్పటికీ మర్చిపోలేను. అదొక గొప్ప థ్రిల్ కలిగించింది.
లీకేజీ...
ఇన్ని కోట్లు పెట్టితీసినా వేరేవాళ్ల లాప్‌టాప్‌లో వుంది అని తెలిసి చాలా బాధపడ్డా. పగవాడికి కూడా ఈ కష్టం రావొద్దు అని అనిపించింది. ఆ 10 రోజుల్లో నరకం కనబడింది. ఈ లీకేజీవల్ల చాలా నష్టం. కొన్ని కాలేజ్, స్కూల్స్‌లో ఆడిటోరియంల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. చాలా దారుణమిది. దానివల్ల కలెక్షన్స్ తగ్గిపోతాయి కానీ ఈ తరహా కలెక్షన్స్ అస్సలు ఊహించలేదు. డిస్ట్రిబ్యూటర్స్ అంతా రెండోరోజుకే బ్రేక్ ఈవెన్‌కు చేరుకున్నారు. బహుశా ఇండస్ట్రీలో ఇలాగ ఎప్పుడు జరుగలేదు. చాలా సంతోషంగా ఉంది.
బన్సీ నెక్స్ట్ సినిమా
నాకు తెలిసి బన్నీ సినిమాల విషయంలో రెండు పెద్ద అనౌన్స్‌మెంట్స్ రానున్నాయి. కథ లాక్ అయ్యేవరకు బన్నీ ఎవరికీ చెప్పడు. ఆయన సినిమా అంగీకరిస్తే ఆ విషయాన్నీ నేనే స్వయంగా ప్రకటిస్తా.