సైరాలో పూనమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ ప్రతిష్ఠాత్మక చిత్రం సైరా. కొణిదల ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్ పరిసరాల్లో వేసిన సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రంలో ఓ కీలక పాత్రకోసం.. హాట్‌గర్ల్ పూనమ్ కౌర్‌ని ఎంపిక చేశారు. ఈ పాత్ర కోసం పలువురు హీరోయిన్స్‌ని ఆడిషన్ చేయగా.. ఫైనల్‌గా పూనమ్ కౌర్‌ని ఎంపిక చేశారట. తాజాగా స్వర్ణఖడ్గం సీరియల్‌తో మంచి మార్కులు కొట్టేసిన పూనమ్‌కు ఇలాంటి క్రేజీ సినిమాలో ఛాన్స్ దక్కడం విశేషం. గ్లామర్ హీరోయిన్‌గా మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ భామకి ఈమధ్య సరైన సక్సెస్ దక్కలేదు. దాంతో అవకాశాలు కరువయ్యాయి. అందుకనే టెలివిజన్ బాట పట్టింది.