గీతా ఆర్ట్స్‌లో మహేష్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా నటిస్తున్న 25వ చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ 25వ సినిమా కావడంతో ఈ సినిమా క్రేజీ ప్రాజెక్టుగా తెరకెక్కుతోంది. వచ్చే ఏప్రిల్ 5న విడుదల చేస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత మహేష్ 26వ సినిమా ఆల్రెడీ సుకుమార్‌తో కమిట్ అయ్యాడు మహేష్.. ఈ సినిమా నవంబర్‌లో సెట్స్‌పైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతోపాటు మహేష్ 27వ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. అయితే ఈ సినిమా ఎవరితో ఉంటుందో తెలుసా.. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఉంటుందట. పైగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించేది ఎవరో ఊహించారా.. అర్జున్‌రెడ్డితో టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారిన సందీప్ రెడ్డి వంగ! అవును.. ఇప్పటికే ఆయన మహేష్‌తో సినిమాకు ప్లాన్ చేశాడు. తాజాగా మహేష్‌కి కథ చెప్పడంతో ఓకె అన్నాడట. సో.. సందీప్‌రెడ్డి దర్శక త్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో మహేష్ 27వ సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ఇపుడే మొదలైంది.