దసరాకు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రవిబాబు నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా అదుగో. ఈ సినిమా అన్ని భారతీయ భాషల్లో విడుదలవుతుండడం విశేషం. అందరికీ కనెక్ట్ అయ్యే యొనిక్ కానె్సప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రవిబాబు. ఇందులో ఓ పంది పిల్ల కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం. ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేషన్‌ను చూపిస్తోన్న సినిమా ఇది. కుటుంబ ప్రేక్షకులను, పిల్లలను బాగా ఆకట్టుకునే కామెడీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. అందుకే ఈ చిత్రాన్ని వీలైనన్ని భాషల్లో విడుదల చేయాలని భావిస్తున్నారు నిర్మాతలు. తెలుగులో అదుగో అనే టైటిల్‌తోనే రానున్న ఈ చిత్రం.. మిగిలిన భాషల్లో మాత్రం బంటి పేరుతో విడుదల కానుంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని దసరా సెలవుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అదుగో సినిమాలో అభిషేక్ వర్మ, నభా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి సమర్పిస్తున్నారు.