బ్యాంకాక్‌లో ‘ఎఫ్ 2’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, మెగా హీరో వరుణ్‌తేజ్‌ల కలయికలో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ఎఫ్2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ ట్యాగ్‌లైన్. ఈ చిత్రం ఇటీవల హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకుంది. తదుపరి షెడ్యూల్ కోసం బ్యాంకాక్‌కు వెళ్ళనుంది చిత్ర యూనిట్. 20 రోజులపాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రంలో వెంకీ సరసన తమన్నా నటిస్తుండగా, వరుణ్‌కు జోడీగా మెహ్రీన్ కౌర్ నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కుటుంబ కథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.