కేరళ కోసం లారెన్స్ సహాయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాఘవ లారెన్స్ తనదైన టాలెంట్‌తో ఎంత గుర్తింపు తెచ్చుకున్నాడో తెలియదు గానీ తన మంచితనంతో మాత్రం అందరికంటే బెస్ట్ సెలబ్రెటీ అని నిరూపించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం కేరళ బాధితుల కోసం చాలామంది తమిళ సినీ ప్రముఖులు సహాయాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చారు. అయితే అందరికంటే ఎక్కువగా లారెన్స్ కోటి రూపాయల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే అందరిలా విరాళాన్ని ఇచ్చి సైలెంట్‌గా ఉండకుండా తన సాయాన్ని చేతులారా బాధితులకు అందాలని లారెన్స్ ట్రై చేస్తున్నాడు. ఎక్కువగా నష్టం కలిగిన ప్రాంతాలకు వెళ్లి బాధితులకు సొంతంగా సాయం చేయాలనీ లారెన్స్ నిర్ణయించుకున్నాడు. అయితే మొదట కేరళ ప్రభుత్వం సహాయక చర్యలకు ఇబ్బందిగా ఉంటుందని చెప్పారు. కానీ ఇప్పుడు వారు అంగీకరించడంతో లారెన్స్ కేరళకు వెళ్లి కొన్ని ప్రాంతాలను పరిశీలించి అక్కడ బాధితులను ఆదుకోవాలని అనుకుంటున్నారు.