ప్రేమ గెలుస్తుందా.. స్నేహం నిలుస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైనేష్ ఫిలింస్ పతాకంపై ఎల్.వి.రాజశేఖర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ లోలుగు సుజయ్ నాయుడు సమర్పణలో గుండ్రెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి నిర్మిస్తున్న ముక్కోణ ప్రేమకథా చిత్రం ‘ఫ్రెండ్‌షిప్ వెర్సెస్ లవ్’. సూర్య, మనీష్, స్నేహ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఎఫ్.ఎం.బాబాయ్, జబర్దస్త్ అప్పారావు, శిరీష, శ్రీకర్ నిరోష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఘంటశాల విశ్వనాథ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ చిత్రం ట్రైలర్, పోస్టర్ విడుదల చేశారు. హైదరాబాద్ ప్రసాద్ లాబ్‌లో ఘనంగా జరిగిన కార్యక్రమంలో శక్తి గ్రూప్ ఎం.డి.రాజశేఖర్ పోస్టర్ రిలీజ్ చేయగా, ట్రైలర్‌ని జె మీడియా అధినేత సురేష్ లాంఛ్ చేశారు. వైజాగ్ బీచ్‌లో భారీ స్థాయిలో పలు రంగాలకు చెందిన పుర ప్రముఖుల సమక్షంలో త్వరలో ఆడియో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని, సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్నామని ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే, సంభాషణలు కూడా కూర్చిన చిత్ర దర్శకుడు ఎల్.వి.రాజశేఖర్ చెప్పారు. ఒకే అమ్మాయిని ఇద్దరు ప్రాణ స్నేహితులు ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలేంటి? స్నేహానికి సవాలుగా నిలిచిన ప్రేమలో ఎవరు విజయం సాధిస్తారు? ప్రేమ గెలుస్తుందా? స్నేహం నిలుస్తుందా? అనే నేపథ్యంలో రూపొందిన ఫ్రెండ్‌షిప్ వర్సెస్ లవ్ ఖచ్చితంగా యువతరంతోపాటు ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాం అని నిర్మాత గుండ్రెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు.