మెగాస్టార్ సరసన?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచయితగా కెరీర్‌ను మొదలుపెట్టి స్టార్ దర్శకుడిగా ఎదిగిన అతికొద్దిమంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. కాగా ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. మంచి సోషల్ మెసేజ్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో చిరు రైతు పాత్రలో నటించనున్నారని సమాచారం. ఇక ఈ చిత్రంలో చిరంజీవి సరసన నటించే హీరోయిన్ కోసం గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం కొరటాల శివ తన తొలి చిత్రం ‘మిర్చి’లో హీరోయిన్‌గా నటించిన అనుష్క శెట్టిని మెగాస్టార్‌తో చేయబోయే సినిమా కోసం హీరోయిన్‌గా తీసుకోనున్నారని, అనుష్క కూడా నటించడానికి అంగీకరించిందని గతంలోనే వార్తలు వచ్చాయి. అయితే చిరు ప్రక్కన అనుష్క నటించడం దాదాపు ఖాయంగానే కనిపిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్‌లో ప్రారంభం కావచ్చట.