31న రానున్న పేపర్ బాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపత్ నంది టీమ్ వర్క్స్, ప్రచిత్ర క్రియేషన్స్, బి.ఎల్.ఎన్. సినిమా పతాకాలపై సంపత్ నంది, వెంకట్, నరసింహ నిర్మించిన సినిమా పేపర్ బాయ్. సంతోష్ శోభన్, రియా సుమన్, తాన్యా హూప్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి జయశంకర్ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 7న విడుదల చేస్తామని ముందుగా ప్రకటించినా తాజాగా సినిమా ప్రీపోన్ అయింది. ఆగస్టు 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా రోడ్ ట్రిప్‌ను ప్లాన్ చేసిన చిత్ర యూనిట్ ఈ రోజున స్టార్ట్ చేశారు. ఈ వివరాలను గురువారం హైదరాబాద్ ప్రసాద్ లాబ్స్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించి అందులో భాగంగా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటను ప్రముఖ గీత రచయిత చంద్రబోస్ పాడటం విశేషం. పాట రాసిన కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ- ఈ పాట విడుదల కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశాను. నాకు ఇన్‌స్పిరేషన్‌గా నిలచిన చంద్రబోస్ ఈ పాటను పాడటం విశేషం. ఆయనకు కృతజ్ఞతలు అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో మాట్లాడుతూ- ఈనెల 31న సినిమా విడుదలవుతోంది. చంద్రబోస్‌ను అడగ్గానే కాదనకుండా పాటను పాడారు. ఎంటైర్ యూనిట్‌ను అభినందించారు అన్నారు. హీరో సంతోష్ శోభన్ మాట్లాతుతూ- ఆగస్టు 31న సినిమా విడుదలవుతోంది. ఈ సినిమాని అందరూ ఆదరిస్తారని నమ్ముతున్నాం అన్నారు. చిత్ర నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ- ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. కాసర్ల శ్యామ్ మంచి సాహిత్యంతో రచించిన పాటను చంద్రబోస్ అద్భుతంగా పాడారు. పేపర్, పేపర్‌బాయ్స్ ఉన్నంతకాలం ఈ పాట నిలిచిపోతుంది. ఆగస్టు 31న విడుదల చేస్తున్నాం అన్నారు.