నిర్మాతల కోసం ‘ఆటగాళ్ళు’ ఆడాలి -- జగపతిబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నారా రోహిత్ హీరోగా, దర్శన బానిక్ హీరోయిన్‌గా జగపతిబాబు ముఖ్యపాత్రలో పరుచూరి మురళి దర్శకత్వంలో ఫ్రెండ్స్ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందిన చిత్రం ఆటగాళ్ళు. నిర్మాతలు వాసిరెడ్డి రవీంద్రనాథ్, వాసిరెడ్డి శివాజీప్రసాద్, మక్కెన రాము, వడ్లపూడి జితేంద్ర సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా నేడు (24న) విడుదవుతోంది. ఈ సందర్భంగా అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్‌లో జగపతిబాబు మాట్లాడుతూ- ఆటగాళ్ళు లాంటి సినిమా చేయడం కొంతవరకు రిస్కే అయినా నిర్మాతలు బడ్జెట్‌కి ఎక్కడా వెనకాడకుండా సినిమాని చాలా రిచ్‌గా నిర్మించారు. ఈ సినిమా చేయడానికి మెయిన్ రీజన్ దర్శకుడు మురళి. నాతో పెదబాబు సినిమా చేశాడు. అందుకే ఈ సినిమా చేశాను. ఫైనల్ ఔట్‌పుట్ చూశాక చాలా హ్యాపీగా ఉంది. క్రైం, కోర్టు డ్రామా అన్నీ చాలా కొత్తగా ఉంటుంది. మేము అంతా బాగా ఇన్‌వాల్వ్ అయి ఈ సినిమా చేశాం. మా కోసం కాకపోయినా నిర్మాతల కోసం ఈ చిత్రం ఆడాలి. విజయ్ సి కుమార్ ఫొటోగ్రఫీ, సాయి కార్తీక్ మ్యూజిక్ సినిమాకి మంచి ప్లస్ పాయింట్‌గా నిలుస్తాయి. ట్రైలర్‌కి మంచి అప్రీసియేషన్ వచ్చింది. రోహిత్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ చేశాడు. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ- బాణం, ప్రతినిధి, రౌడీఫెలో చిత్రాల్లో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేశాను. ఆటగాళ్ళు చిత్రం కొత్త జోనర్ నాకు. ఇలాంటి చిత్రానికి నన్ను కన్విన్స్ చేసి తీసిన పరుచూరి మురళికి థాంక్స్. సాయి కార్తీక్ రీరికార్డింగ్ అద్భుతంగా చేశాడు. విజయ్‌తో ఫస్ట్ సినిమా. విజువల్స్ అద్భుతంగా ఇచ్చారు. గోపీ మోహన్ సూపర్ డైలాగ్స్ రాశారు. డిఫరెంట్ క్యారెక్టర్ చేశానని తృప్తి కలిగింది. ఈ సినిమా బాగా ఆడి నిర్మాతలకు డబ్బులు రావాలని కోరుకుంటున్నానన్నారు. దర్శకుడు పరుచూరి మురళి మాట్లాడుతూ- ఈ సినిమాకి నా ఫ్రెండ్స్ నిర్మాతలు. వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదు. జగపతిబాబు, రోహిత్ స్క్రిప్ట్‌ను నమ్మి నామీద నమ్మకంతో చేశారు. ఈ సినిమాని థియేటర్‌దాకా తీసుకెళ్తున్న నా నిర్మాతలు నిజమైన హీరోలు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి నా టెక్నికల్ టీమ్ మెయిన్ కారణం. వారందరికీ నా థాంక్స్ అన్నారు. నిర్మాతల్లో ఒకరైన వాసిరెడ్డి రవీంద్రనాథ్ మాట్లాడుతూ- సినిమాని సక్సెస్‌ఫుల్‌గా తీసి ఆగస్టు 24న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. తప్పకుండా చిత్రం పెద్ద హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాం. విజయ్ సి కుమార్ కెమెరా వర్క్, మార్తాండ్ కె వెంకటేశ్ ఎడిటింగ్, సాయికార్తిక్ మ్యూజిక్ సినిమాకి హైలెట్స్ అవుతాయి. కెమెరామెన్ విజయ్ సి కుమార్, రచయిత గోపీ మోహన్, నటులు శ్రీతేజ, ఫణి తదితరులు ప్రసంగించారు.