రొటీన్ పాత్రలు చేయను -- ఆది పినిశెట్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వైరం ధనుష్‌గా నెగెటివ్ షేడ్.. మరోవైపు కుమార్ బాబుగా ఊరికోసం పాటుపడే వ్యక్తి.. ఇలా భిన్నమైన పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నాడు ఆది పినిశెట్టి. ఓవైపు సోలో హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు భిన్నమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాడు. ప్రస్తుతం ఆయన సోలో హీరోగా నటిస్తున్న చిత్రం నీవెవరో. తాప్సీ, రితికాసింగ్ నాయికలుగా కోన ఫిలిమ్ కార్పొరేషన్, ఎం.వి.వి. సినిమా పతాకాలపై హరినాథ్ దర్శకత్వంలో కోన వెంకట్, ఎం.వి.వి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం శుక్రవారం (నేడు) విడుదలవుతున్న సందర్భంగా హీరో ఆది చెప్పిన సంగతులు..
ఈ సినిమా చూసిన తర్వాత చాలామంది ముందు తాప్సీ గురించి, తర్వాత తులసి గురించి మాట్లాడారు. వారి పాత్రలు అంత గొప్పగా కుదిరాయి. తాప్సీ ఈ సినిమా చేయకపోతే ఈ సినిమాకు అంత వేల్యూ వచ్చి ఉంటుందని నేను అనుకోను. తను చాలా సెన్సిబుల్‌గా సినిమాలు సెలెక్ట్ చేస్తారు. రితికా కూడా నేషనల్ అవార్డు విన్నర్. వాళ్ల డెడికేషన్ ఈ సినిమాకు చాలా ప్లస్ అయింది. అలాగే సినిమా టెక్నికల్ విషయంలో ఎడిటింగ్ గురించి ఎక్కువ డిస్కస్ చేయం. దాని గురించి అవగాహన కూడా మనకు ఉండదు. తీసిన ఫుటేజ్ మొత్తం ఓ రూమ్‌లో వేస్తే, ఎడిటర్ సినిమాగా రూపుదిద్దుతాడు. ఎడిటర్ ప్రదీప్ లేకపోతే ఈ సినిమా ఇంత బాగా వచ్చి ఉండేది కాదేమో. మేం సినిమా గురించి ఎక్కువ చెప్పకూడదు. మేమందరం నిజాయితీగా పనిచేశాం. అందరికీ తప్పకుండా నచ్చుతుంది అన్నారు. 12 ఏళ్ళ క్రితం ఒక విచిత్రం సినిమా ద్వారా వచ్చాను. అందరూ ఆదరించారు. తమిళ్‌లోకి వెళ్ళాను. మా అమ్మమ్మకి నేను తెలుగులో హీరోగా చేస్తే చూడాలని కోరిక. ఈ సినిమాను ఆమెకు డెడికేట్ చేస్తున్నా. తప్పకుండా సోలో హీరోగా నాకు మంచి బ్రేక్ ఇస్తుంది. ఇందులో నేను అంధుడిగా కనిపిస్తాను. కళ్యాణ్ అనే అబ్బాయి తన 15వ ఏటా అంధుడిగా మారతాడు. ఆ తరువాత అతని లైఫ్‌లో జరిగిన సంఘటనలు ఏమిటన్నది ఈ సినిమా. కథలో కొత్తదనం ఉంది. దర్శకుడు హరి చాలా బాగా తెరకెక్కించాడు.
సోలో హీరోగా చేస్తున్నా కూడా ఇతర సినిమాల్లో బెస్ట్ పాత్రలు వస్తే తప్పకుండా చేస్తా. అలా చేయకుంటే కుమార్‌బాబు, వైరం ధనుష్ పాత్రలు వచ్చేవి కావు. సరైనోడు తరువాత నాకు చాలా అవకాశాలు వచ్చాయి. కానీ ఒకే తరహా పాత్రలు చేయాలనీ లేదు. అందుకే చాలా సినిమాలు వదులుకున్నా. భిన్నమైన పాత్రలు మాత్రమే చేస్తా. ప్రస్తుతం తమిళంలో ఓ సినిమా చేస్తున్నాను. దాంతోపాటు తెలుగు ఆర్‌ఎక్స్ 100 రీమేక్ చేస్తున్నా.
- శ్రీ