24 కిస్సెస్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిత్ అరుణ్, హెబ్బాపటేల్ జంటగా అయోధ్యకుమార్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘24 కిస్సెస్’. సిల్లీమాంక్స్ కంబైన్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ పతాకాలపై సంజయ్‌రెడ్డి, అనిల్ పిల్లాలా, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. చిత్ర ట్రైలర్ విడుదలయింది. ఈ సందర్భంగా దర్శకుడు అయోధ్యకుమార్ మాట్లాడుతూ, నేను రూపొందించిన ‘మిణుగురులు’చిత్రం ఎంతటి పేరు తెచ్చిందో తెలిసిందే. సినిమానే నా ఇంటి పేరుగా మారింది. ఈ సినిమా సెట్ అవడానికి గిరిధర్ కారణం. ఇది రెండున్నరేండ్ల ప్రయాణం. ఇప్పుడు ప్రతిభను గుర్తించే నిర్మాతలు అవసరం. ఈ చిత్ర నిర్మాతలు చాలా సెన్సిబుల్. ఇదొక బ్యూటిఫుల్ లవ్‌స్టోరీ. అందుకు తగ్గట్టే అందమైన నటీనటులు దొరికారు. కిస్‌లు, హగ్‌లు అనేది ఒక ఉత్సవంలా ఉంటుందనేది ఈ సినిమాలో చెప్పదలచాం. చాలా ఎమోషన్స్ ఉంటాయి. ఆర్ట్, కమర్షియల్ మేళవింపుగా ఉంటుంది. జెన్యూన్‌గా, నిజాయితీగా తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా మలిచాం. సినిమాలో ఏడు పాటలుంటాయి. జోయిబరు మంచి సంగీతాన్ని అందించారు. హెబ్బా యాక్టింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో సినిమా చూస్తే అర్థమవుతుంది. సెప్టెంబర్ 13న సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ చిత్రాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా’ అని అన్నారు. ‘గరుడవేగ’ నాకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఓ ఫంక్షన్‌లో హీరో నాని ‘నువ్వు లవ్‌స్టోరీస్ చేయొచ్చుకదా’అన్నారు. నాకూ చాలారోజులుగా ప్రేమ కథలు చేయాలని ఉండేది. ఇంత భిన్నమైన ప్రేమకథ చేయాల్సివస్తుందని అనుకోలేదు. నన్ను ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన సంజయ్ ఇప్పుడు నా సినిమాను నిర్మించడం హ్యాపీగా ఉంది. ఇంటెన్స్ లవ్‌స్టోరీ ఇది. ప్రేమ, అమ్మాయిల విషయంలో నేటి యువత ధోరణులను ప్రతిబింబిస్తుంది’ అని హీరో ఆదిత్ తెలిపారు. నిర్మాత సంజయ్‌రెడ్డి చెబుతూ, ‘అయోధ్యకుమార్ ఈ కథతో వచ్చినప్పుడు ఒప్పుకోలేదు. కథ విన్నాక కన్విన్స్‌అయ్యాను. సినిమా చూశాక చాలా హ్యాపీగాఫీలయ్యా’ అని చెప్పారు. ‘గతంతోపోల్చితే చాలా వైరుధ్యం కలిగిన పాత్ర పోషించా, కచ్చితంగా ఆడియెన్స్‌కు నచ్చుతుంది’అని హెబ్బాబాపటేల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్మాత అనిల్, నటులు మధు, అన్షు, అదితి మ్యాకల్ పాల్గొన్నారు.