‘వైరం’ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కన్నడ నటుడు దేవరాజ్ తనయుడు ప్రణమ్ దేవరాజ్ కథానాయకుడిగా ‘వైరం’ చిత్రం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో ప్రారంభమైంది. సాయి శివన్.జె దర్శకుడు. శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున పిక్చర్స్ పతాకంపై జె.ఎం.కె నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి దర్శకుడు వి.సాగర్ క్లాప్‌నిచ్చారు. వి.ఎన్.ఆదిత్య కెమెరా స్విచ్చాన్ చేశారు. శ్రీవాస్ గౌరవ దర్శకత్వం వహించారు. దేవరాజ్ మాట్లాడుతూ- కన్నడంతోపాటు తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించాను. ఇపుడు మా అబ్బాయిని తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం చేస్తున్నా. నాపై చూపించిన అభిమానాన్ని తన కుమారుడిపై కూడా చూపిస్తారని ఆశిస్తున్నా అన్నారు. చక్కని ప్రేమకథతోపాటు యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం ఉంటుంది. ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తాం అన్నారు. హీరో ప్రణమ్ దేవరాజ్ మాట్లాడుతూ- కన్నడలో కుమారి 21ఎఫ్ రీమేక్‌లో నటించా. అక్కడ నన్ను హీరోగా నిలబెట్టింది. యాక్షన్ కథాంశంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొస్తున్నా. తెలుగు ప్రేక్షకుల్ని మెప్పించడానికి శాయశక్తులా కృషిచేస్తా అన్నారు. నిర్మాత జె.ఎం.కె మాట్లాడుతూ- మా బ్యానర్‌లో తొలి సినిమా ఇది. వచ్చే నెల మొదటివారంనుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది అన్నారు. విన్ను మద్దిపాటి, స్వప్న, మల్లికార్జున, శత్రు, ప్రమోదిని, కాశీ విశ్వనాధ్, సత్య తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:గోపీనాధ్, సంగీతం:సాగర్ మహతి, ఆర్ట్:పి.వి.రాజు.