దసరాకు హలో గురు ప్రేమకోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతోన్న లవ్ ఎంటర్‌టైనర్ ‘హలో గురు ప్రేమకోసమే’. పలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సిబుల్, క్యూట్ ప్రేమకథా చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్లుగా నటిస్తున్నారు. సినిమా చూపిస్త మావ, నేను లోకల్ చిత్రా దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. టాకీ పార్టు పూర్తయ్యింది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 18న విడుదల చేయాలని నిర్మాత దిల్‌రాజు సన్నాహాలు చేస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలక పాత్రలో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీత సారథ్యం వహిస్తున్నారు. విజయ్ కె చక్రవర్తి సినిమాటోగ్రఫి, కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.