నా కెరీర్‌లో బెస్ట్ యూ టర్న్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సమంత ప్రధాన పాత్రలో నటించిన యు టర్న్ పవన్‌కుమార్ దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్, వివై కంబైన్స్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి, రాంబాబు బండారు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక కీలక పాత్రధారులు. ఈ చిత్రం వినాయక చవితి సందర్భంగా విడుదలై మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నటుడు ఆది పినిశెట్టి చెప్పిన విశేషాలు.. ఈ సినిమాకు ఇంత మంచి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. విడుదలైన అన్ని కేంద్రాలనుండి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. నిజంగా ఇంత మంచి సినిమాలో నటించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాలో నేనెంత సేపు కనిపిస్తాను లాంటివి పక్కనపెడితే, ఒక మంచి సినిమాలో నేను పార్ట్ అవుతాను అన్న ఫీల్‌తో ఈ సినిమా చేశాను. మన కర్మ మనలని వెంటాడుతోంది అంటాం కదా. అదే యు టర్న్ సినిమా. ఎవరూ చూడట్లేదు కదా అని కొన్ని తప్పులు చేస్తుంటాం. ఎవరూ రావట్లేదు కదా అని ట్రాఫిక్ సిగ్నల్స్ దాటేస్తుంటాం. అలా మనం చేసిన తప్పే మనల్ని ఎలా చుట్టుకుంటుంది అనేది ఈ సినిమాలో చూస్తారు. సమంతాతో సినిమాలో చూడటం వేరు, సెట్స్‌పై పనిచేయడం వేరు. సమంత నాకు రంగస్థలంకన్నా ముందే తెలిసినా, కలిసి పనిచేసేటప్పుడు తనేంటనేది తెలిసింది. తనతో పనిచేయడం చాలా కంఫర్టబుల్‌గా ఉంటుంది. పవన్‌కుమార్ చేసిన సినిమాలు చూస్తే తను ఈ జనరేషన్ దర్శకుడు కాదనిపిస్తుంది. నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్. అంత బియాండ్‌గా ఆలోచిస్తాడు. ఈ సినిమాకి ఎవరు పనిచేసినా పవన్ కోసమే చేశాం. యాక్టర్స్, రైటర్స్, ఫిలిం మేకర్స్ కానీ రియల్ లైఫ్‌కన్నా ఇమాజినేషన్‌లోనే బ్రతికేస్తుంటాం. నా వరకు నేనొక సినిమాలో నటిస్తున్నాంటే, నాది కాని ఒక క్యారెక్టర్‌ని బ్రతికేస్తుంటా.. అదే మా లైఫ్.. ఆ లెక్కన నా లైఫ్‌లో ప్రతిక్షణం థ్రిల్లింగ్‌గానే ఉంటుంది. థ్రిల్లర్ అంటే సినిమా చూస్తున్నంతసేపు తరువాత ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీని జనరేట్ చేయడం, ఆ ఫీల్‌ని ఆడియన్స్‌లో సినిమా సగం వరకైనా హోల్డ్ చేయగలిగామంటే ఆ సినిమా సూపర్‌హిట్టే. నా దృష్టిలో కమర్షియల్ సినిమా అంటే, నా ప్రొడ్యూసర్ పెట్టే ప్రతి రూపాయి వెనక్కి రావడం. అలా జరిగిందంటే అది కమర్షియల్‌గా సక్సెస్‌ఫుల్ సినిమానే. సినిమాలో నా క్యారెక్టర్ కన్నా ముందు కథ గురించే ఎక్కువ ఆలోచిస్తే. కథ కన్నా ముందు నేను పనిచేసే టీమ్ గురించి ఆలోచిస్తా. కథ తరువాత సినిమా సక్సెస్‌కి రీజన్ అయ్యేది టీమే. నా గత సినిమాల్లో చేసిన తప్పులు మళ్లీ రిపీట్ చేయకుండా సినిమాలు చేస్తా. నా తదుపరి చిత్రాలు.. ఆర్‌ఎక్స్ 100 రీమేక్‌తోపాటు మరో మూడు కథలు రెడీగా ఉన్నాయి. ఏది పస్ట్ చేస్తానో నాక్కూడా తెలీదు. కొత్త జోనర్ సినిమాలు చేస్తూనే కమర్షియల్ చేయాలి అనుకుంటున్నా. రెండూ బ్యాలెన్స్ చేస్తూ చేయాలి సినిమాలు. ఆర్‌ఎక్స్ 100 సినిమాలో కొన్ని మార్పులు చేస్తున్నాం. స్క్రిప్ట్‌ను మార్చకుండా ఇంకా అడిషనల్‌గా అట్రాక్టివ్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్నాం.