చరితార్ధుడు అక్కినేని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(నేడు తెలుగు జాతి గర్వించతగిన మహానటుడి జయంతి సందర్భంగా)
అక్కినేనిని నిర్వచించడం ఎవరి తరం? మహానటుడిని విశే్లషించడం ఎవరికి సాధ్యం? ఆయన రాసిచ్చిన అఆలు దిద్దనంత సులువుకాదు, అంతరంగాన్ని అర్థం చేసుకోవడం. అలుపెరుగని ప్రయాణంలో ఆయన్ని అందుకోవడమే కాదు, అనుసరించడమూ ఎవరికీ సాధ్యం కాలేదు. తెలుగు సినిమా నుంచి అక్కినేని నేర్చుకున్న దానికంటే, నేర్పిపెట్టిందే ఎక్కువ. అందుకే -తెలుగు సినిమాను చదివితే అక్కినేని అర్థంకాకపోవచ్చు.. అక్కినేనిని చదివితే మాత్రం తెలుగు సినిమా అవగతమవుతుంది. అంతెందుకు? పొడిగానో తడిగానో అక్కినేని గురించి చెప్పాలంటే.. మళ్లీ అక్కినేనే రావాలి. లేదా ఆయన వదిలెళ్లిన అఆలను జ్ఞాపకాల పలకలపై దిద్దుకోవాలి.
తెలుగు చిత్రసీమను దశాబ్దాలపాటు నిరాటంకంగా ఏలిన రారాజులు ఇద్దరు. ఒకరు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రాముడు, మరొకరు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు. చిత్రసీమలో నటులుగా పోటీపడినా, జీవితంలో సోదర భావంతో మెలిగిన ఇరువురూ తెలుగు ప్రజా హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించారు. తెలుగు చిత్ర పరిశ్రమను మదరాసు నుంచి హైదరాబాద్‌కు మార్చడంలో ప్రముఖ పాత్రపోషించి, పరిశ్రమ ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటి చెప్పిన నటుడు, నిర్మాత, అన్నపూర్ణ స్టూడియో అధినేత అక్కినేని. స్టేజి నాటకాల్లో స్ర్తి పాత్రలతో నటనకు మెరుగులు దిద్దుకుని, ప్రముఖ చిత్ర నిర్మాత ఘంటసాల బలరామయ్యకు విజయవాడ రైల్వే స్టేషన్‌లో తారసపడిన నాగేశ్వరావు, ధర్మపత్ని సినిమాతో తెలుగు చిత్రసీమలో ఆరంగేట్రం చేశారు. 90యేళ్ల జీవితంలో 75 సంవత్సరాలు విభిన్న పాత్రల ద్వారా తెలుగు చిత్రరంగ క్రమానుగత ప్రగతిలో విడదీయలేని బంధం, అనుబంధం అక్కినేనిది. 1923 సెప్టెంబర్ 20న కృష్ణా జిల్లా గుడివాడ తాలూకా నందివాడ మండలం రామాపురంలో వెంకటరత్నం, పున్నమ్మ దంపతులకు జన్మించిన అక్కినేని, బాల్యం నుంచే నాటకాలమీద అనురక్తి పెంచుకున్నారు. 1941లో పి.పుల్లయ్య దర్శకత్వం వహించిన ధర్మపత్నిలో బాల నటునిగా తొలిసారి మేకప్ వేసుకున్నారు. 1944లో ఘంటసాల బలరామయ్య నిర్మాత, దర్శకుడిగా తెరకెక్కించిన సీతారామ జననంలో పూర్తిస్థాయి కథానాయకుడి పాత్ర పోషించారు. 1949లో అన్నపూర్ణను వివాహమాడిన అక్కినేని.. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 256 సినిమాలు చేసిన అనుభవజ్ఞుడు. చివరిగా మనం చిత్రంలో సహజ నటనా ప్రతిభను రుచి చూపించారు. 75 ఏళ్ళ సినీ ప్రస్తానంలో శరత్ చంద్ర నవల దేవదాసు (1953)లో భగ్న ప్రేమికుని పాత్రకు జీవం పోశారు. 1966లో నవరాత్రి చిత్రంలో 9 పాత్రలు పోషించి ఔరా! అనిపించారు. లైలామజ్ను, అనార్కలి, బాటసారి, ప్రేమ్‌నగర్, ప్రేమాభిషేకం, మేఘ సందేశం లాంటి సినిమాల్లోని విషాద పాత్రల్లో, మిస్సమ్మ, చక్రపాణి, ప్రేమించిచూడు వంటి చిత్రాల్లో హాస్యరస ప్రధాన పాత్రలు, మాయాబజార్‌లో అభిమన్యునిగా, చెంచులక్ష్మిలో విష్ణువుగా, భూకైలాస్‌లో నారదునిగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో పాండవ మధ్యమునిగా పౌరాణిక పాత్రల్లో మెప్పించారు. దాసరి దర్శకత్వం వహించిన ప్రేమాభిషేకం హైదరాబాద్‌లో 533రోజులు, నిరంతరాయంగా 365రోజులు ప్రదర్శితమైన ఒకే ఒక్క తెలుగు సినిమాగా రికార్డు సొంతం చేసుకుంది. జయదేవ, కాళిదాసు, జక్కన, విప్రనారాయణ పాత్రలు అక్కినేని నటనకు కలికి తురాయిలు. మట్టి మనుషులు, ఒకే ఒక్కడు బుల్లితెర సీరియల్స్‌లోనూ నటించి, సమకాలీన నటులకు మార్గదర్శకులైనారు. 1989లో రాజ్‌కపూర్ స్మారక అవార్డు, 88లో రఘుపతి వెంకయ్య అవార్డు, కేంద్ర ప్రభుత్వం ద్వారా పద్మభూషణ్, 91లో దాదాసాహెబ్ ఫాల్కీ, 94లో లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్, 95లో అన్నా అవార్డు, 68లో భారత ప్రభుత్వ పద్మశ్రీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, డాక్టర్ ఆఫ్ లెటర్స్, నట సామ్రాట్, కళా ప్రపూర్ణలాంటి లెక్కలేనన్ని అవార్డులు సొంతం చేసుకున్న మహా నటుడు అక్కినేని. గుడివాడ కళాశాలకు అక్కినేని ఇచ్చిన బూరి విరాళంతోనే ఏఎన్‌ఆర్ కళాశాలగా నామాంకిత అయింది. తన 91వ ఏట 2014 జనవరి 22న తెలుగు జాతి గర్వించ దగిన మహానటుడు పరమపదించే వరకు వెండితెరతో విడదీయరాని వ్యక్తిగా కొనసాగారు.

-సంగనభట్ల రామకిష్టయ్య....9440595494