సెన్సార్‌కు సకల కళా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తనిష్క్‌రెడ్డి, మేగ్లాముక్త హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘సకల కళావల్లభుడు’. సింహా ఫిలిమ్స్, దీపాల ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రానికి దర్శకుడు శివగణేష్. షూటింగ్ పార్ట్ పూర్తవడంతో, సెన్సార్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. చిత్ర దర్శకుడు శివగణేష్ మాటల్లో.. పూర్తి కమర్షియల్ హంగులతో కూడిన విలేజ్ నేపథ్యంలో సాగే యాక్షన్ కామెడీ చిత్రమిది. ముఖ్యంగా హీరో, విలన్ మధ్య సాగే యాక్షన్ సన్నివేశాలు సంక్రాంతి కోడి పందేల్లా కనువిందు చేస్తాయి. 30 ఇయర్స్ పృథ్వీ చూపించిన ఓ మేనరిజం.. థియేటర్‌నుంచి బయటకు వచ్చిన తర్వాతా ప్రేక్షకులను వెంటాడుతుంది. నిర్మాతల్లో ఒకరైన అనిల్‌కుమార్ మాట్లాడుతూ పెద్ద హీరోల చిత్రాలలో ఉండే ఫైట్స్, డ్యాన్స్‌లకు ఎక్కడా తీసిపోకుండా మా హీరో పెర్‌ఫార్మెన్స్ చేశాడు. కథ, కథనాలలో కొత్తదనంతోపాటు నటీనటుల పెర్‌ఫార్మెన్స్ చిత్రానికి హైలెట్. ఇటీవల విడుదలచేసిన సింగర్ గీతామాధురి పాడిన ‘తిక్కరేగిన వంకరగాళ్లు’ సాంగ్‌కు మంచి స్పందన వచ్చింది. టీజర్‌ను త్వరలోనే విడుదల చేసే ప్రయత్నాల్లో ఉన్నాం. అజయ్ పట్నాయక్ సంగీతం, సాయిచరణ్ కెమెరా, ధర్మేంద్ర (గరుడవేగ ఫేమ్) ఎడిటింగ్ సినిమాకు ప్రధాన ఆకర్షణలు.