మనసు దోచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సుధీర్‌బాబు, నభానటేశ్ జంటగా సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆర్.ఎస్.నాయుడు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘నన్ను దోచుకుందువటే’. ఈనెల 21న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం జరిగిన సక్సెస్ మీట్‌లో.. మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ మాట్లాడుతూ ‘సినిమా సక్సెస్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉంది. కిర్రాక్ పార్టీలో చేసిన మ్యూజిక్ నచ్చడంతో దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు అప్రోచ్ అయ్యారు. తన షార్ట్ఫిలిం చూశాను. కథ నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించాను. సుధీర్ స్వంత బ్యానర్‌లోనే సినిమా చేయడం ఆనందంగా ఉంది అన్నారు. దర్శకుడు ఆర్.ఎస్.నాయుడు మాట్లాడుతూ.. ‘కామెడీ, ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌అయ్యాయి. షార్ట్ ఫిలిం సీన్, ఎమోషనల్ సీన్ తండ్రీ కొడుకుల సీన్ అందరికీ కనెక్ట్ అవుతుంది. అందరూ ఫోన్స్‌చేసి బాగాచేశావని అభినందిస్తున్నారు. నిర్మాతగా సుధీర్‌గారు కథను నమ్మి చేసిన సినిమా ఇది. నభా ఎనర్జిటిక్‌గా నటించింది. తన క్యారెక్టర్‌ను చక్కగా క్యారీ చేసింది. సక్సెస్‌లో భాగమై సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ థాంక్స్’ అన్నారు. నభా నటేశ్ మాట్లాడుతూ.. ‘నేను బాగా నటించానని అందరూ అంటుండడంతో ఆనందంగా ఉంది. సినిమాలో సపోర్ట్‌చేసిన అందరికీ థాంక్స్ అన్నారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ.. క్లీన్ యు మూవీ.. ఫ్యామిలీ అంతా కలిసి చూసే మూవీని నా తొలి చిత్రంగా ప్రొడ్యూస్ చేసినందుకు గర్వంగా ఉంది. సెన్సార్‌వాళ్లు సినిమా చూసి చాలా బాగా ఉందనే చెప్పడంతో మాకు చాలా నమ్మకం వచ్చింది. సినిమా చూసిన హరీష్, రానా, ఇంద్రగంటి, సందీప్, గోపీమోహన్ అందరూ సోషల్ మీడియాలో తమ సపోర్ట్‌ను అందించారు.
విమర్శకులు కూడా సినిమా బావుందని అప్రిసియేట్ చేయడం ఆనందంగా ఉంది. ప్రేక్షకులు వౌత్ టాక్‌తో ఇంకా పెద్ద సక్సెస్ వైపుకు వెళుతుంది. ప్రతి షోకు ఆదరణ పెరుగుతుంది. అజనీష్ వెర్సటైల్ మ్యూజిక్ అందించాడు. అలాగే క్లైమాక్స్‌లో తండ్రీకొడుకుల సీన్‌ను బొమ్మరిల్లులో క్లైమాక్స్ సీన్‌తో కంపేర్ చేశారు. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు హ్యాపీగా అనిపించింది’ అన్నారు.