5న ప్రేమెంత పనిచేసె..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత హీరోహీరోయిన్లుగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో సావిత్రి జొన్నలగడ్డ నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమెంత పనిచేసె నారాయణ’. జె.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పిస్తున్న చిత్రం అక్టోబర్ 5న విడుదలవుతోంది. దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇప్పటివరకు పెద్ద హీరోలతో 8 సినిమాలు చేశాను. 9వ సినిమా మాత్రం కొత్తవారితో, కొత్త కానె్సప్ట్‌తో చేస్తున్నా. ఓ మామూలు కుర్రాడు తన ప్రేమను ఎలాంటి వెపన్ ఉపయోగించి సాధించుకున్నాడన్నదే కథనం. మా అబ్బాయి హరిని హీరోగా పరిచయం చేస్తున్నాం. జగపతిబాబు వాయిస్ ఓవర్ ప్రత్యేక ఆకర్షణ. నన్ను ఆదరించినట్టే, హరినీ ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నారు. హీరో హరికృష్ణ జొన్నలగడ్డ మాట్లాడుతూ ‘ఇది రెగ్యులర్ సినిమా కాదు. లవ్ స్టోరీల్లో డిఫరెంట్. హీరో ప్రేమని గెలిపించడానికి ఫ్రెండ్స్ పడే తపన, స్నేహం యొక్క గొప్పతనం ఇందులో కనిపిస్తుంది. ప్రతి లవర్స్‌కి సినిమా కనెక్టవుతుంది’ అన్నాడు. పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని సంగీత దర్శకుడు యాజమాన్య వివరించారు.