మళ్లీ.. ఓ లవ్ స్టోరీతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్లలో ‘కృష్ణవంశీ’ పేరు ఎప్పుడూ ముందువరుసే. కానీ కొనే్నళ్లుగా ఆయన చిత్రాలు బాక్సాఫీస్‌వద్ద బోర్లా పడుతున్నాయి. ఒకప్పుడు మోస్ట్‌వాంటెడ్ డైరెక్టర్‌గా హవా నడిపించిన ఈ క్రియేటర్‌కు, ఇప్పుడు కొత్తవాళ్లతో కొత్త ప్రేమకథలు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏమైనా కుటుంబ కథా చిత్రాలతోపాటు ప్రేమ కథాచిత్రాలు తియ్యడంలో కృష్ణవంశీ శైలే వేరు. ఆర్టిస్ట్‌ల నుంచి తనకు కావాల్సినది రాబట్టుకోవడంలో, కంటెంట్‌వున్న స్క్రిప్ట్‌లను ఎంపిక చేసుకోడవంలోగాని ఆయన అభిరుచే వేరు. కాగా కృష్ణవంశీ కొన్ని నెలలుగా ఓ ప్రేమకథపై వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. అదిప్పుడు ఓ కొలిక్కి వచ్చిందని తెలుస్తోంది. ప్రేమకథను కొత్తవాళ్లతోనే తీయాలని కృష్ణవంశీ నిర్ణయించుకున్నట్టు సమాచారం. తాజాగా తన కథలోని పాత్రలకు సరిపోయే కొత్తవాళ్లను వెతికే పనిలో ఉన్నాడని అంటున్నాడు. కొత్త ప్రేమకథతో మళ్లీ కృష్ణవంశీ ఫామ్‌లోకి వస్తాడేమో చూడాలి. సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.