శర్వానంద్ ఫొటోగ్రాఫరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో యువ హీరో శర్వానంద్, ‘్ఫదా’ బ్యూటీ సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఇటీవల నేపాల్ షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షెడ్యూల్‌లో శర్వానంద్, సాయిపల్లవిల రొమాంటిక్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ షెడ్యూల్‌తో చిత్ర షూటింగ్ పూర్తికానుంది. అక్టోబర్ మొదటివారంలో సినిమా టాకీపార్ట్ కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న చిత్రంలో శర్వా ఫుట్‌బాల్ ప్లేయర్‌గా నటిస్తుంటే, సాయిపల్లవి డాక్టర్‌గా కనిపించనుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న చిత్రాన్ని చెరుకూరి సుధాకర్, చుక్కపల్లి ప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.