...మరో ప్రేమకథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విరాజ్ జె అశ్విన్ హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘అనగనగా ఓ ప్రేమకథ’. కె సతీష్‌కుమార్ సమర్పణలో టి ప్రతాప్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో రిద్దికుమార్, రాధాబంగారు నాయిక పాత్రలు పోషిస్తున్నారు. సినీరంగంలో పెద్ద ఫైనాన్షియర్‌గా పేరొందిన నిర్మాత కెఎల్‌యన్ రాజు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సాంగ్ ‘నిన్ను విడవనులే’ను పూరి జగన్నాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంలో డైరెక్టర్ పూరి మాట్లాడుతూ -ప్రొడ్యూసర్ కెఎల్‌యన్ రాజుతో ‘అమ్మనాన్న తమిళమ్మాయి’కి పనిచేశానని గుర్తు చేసుకున్నారు. మళ్లీ ఆయనతో సినిమా చేయాలనుకున్నా, ఇతర వ్యాపారాల్లో ఆయన బిజీ అయిపోయి కుదరలేదన్నారు. చాలా రోజులు తరువాత ‘అనగనగ ఓ ప్రేమకథ’ సినిమా నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. మార్తండ్ కె వెంకటేష్ మేనల్లుడైన విరాజ్ అశ్విన్ హీరోగా అరంగేట్రం చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మార్తండ్‌తో చాలా సినిమాలకు పనిచేశానని, తప్పకుండా విరాజ్ అశ్విన్ మంచి హీరో అవుతాడన్న ఆశాభావం వ్యక్తం చేశారు. డైరెక్టర్ ప్రతాప్‌కి బెస్ట్ విషెస్ చెపుతూ ‘సినిమా హిట్ కావాలి’ అని ఆకాంక్షించారు. తమ చిత్రం తొలి పాటను ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ విడుదల చేయటంపట్ల చిత్ర నిర్మాత ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకొన్న చిత్రం, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. అక్టోబర్‌లో చిత్రం విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు.