నాని అట్ 96?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ఒక తమిళ సినిమాపై మనసు పారేసుకుని రీమేక్ హక్కులు దక్కించుకోవడం తెలిసిందే. అదే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటిస్తున్న ‘96’. ఈ చిత్రం ఆయనకు బాగా నచ్చడంతో సుమారు కోటి పెట్టి రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు. తాజాగా చిత్రాన్ని నానికి చూపెట్టాడట దిల్‌రాజు. నానికీ సినిమా నచ్చిందని సమాచారం. కానీ, చేయడానికి ఒప్పుకుంటాడా? లేదా? అన్నదే సందిగ్దం. నాని నటించిన ‘దేవదాస్’ విడుదలకు సిద్ధంగావుంది. ఈ సినిమా తరువాత ఆయన ‘జెర్సీ’ చేస్తున్నాడు. దాని తరువాత ‘96’నీ లైన్లో పెడతాడో లేదో చూడాలి. ప్రేమ్‌కుమార్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ఫొటోగ్రాఫర్‌గా నటిస్తున్నాడు. 1996లో జరిగే ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం అక్టోబర్ 4న తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. మద్రాస్ ఎంటర్‌ప్రైజెస్ పతాకంపై నందగోపాల్ నిర్మిస్తున్న చిత్రానికి గోవింద్ మీనన్ సంగీతం.